ఇద్దరు యువకుల ఓ సెక్స్‌వర్కర్‌(Sexworker) ప్రేమాయణం(Love story) చేయడంతో ఓ యువకుడు బలయ్యాడు. ఓ సెక్స్‌ వర్కర్‌తో తొలుత ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. తనను ప్రేమిస్తూనే మరో యువకుడితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోందని ఆగ్రహించిన మొదటి యువకుడు అతనిని కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఇద్దరు యువకుల ఓ సెక్స్‌వర్కర్‌(Sexworker) ప్రేమాయణం(Love story) చేయడంతో ఓ యువకుడు బలయ్యాడు. ఓ సెక్స్‌ వర్కర్‌తో తొలుత ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. తనను ప్రేమిస్తూనే మరో యువకుడితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోందని ఆగ్రహించిన మొదటి యువకుడు అతనిని కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని మాంద్‌ సౌర్‌ భావ్‌ఘర్‌(Mand Saur Bhavgarh) ప్రాంతంలో ఓ కారులో యువకుడి శవాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా రక్తం మడుగులో ఉన్న యువకుడి శరీరంలో 4 బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి కాల్‌లిస్ట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని రత్లాం డివిజన్‌ జూనియర్ ఇంజినీర్ దీక్షత్‌ పాండ్యా(27)గా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకేసు నమోదు చేసుకొని విచారించగా ఇందులో యువతి, యువకుడు ఉన్నట్లు నిర్ధారించారు. ఓ యువతి సెక్స్‌ వర్కర్‌గా ఉండేది. ఆమె మొదటగా మోహిసిన్‌(Mohsin) అనే యువకుడిని ప్రేమించింది. కొద్దికాలం ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ మోహిసిన్‌ను ఆమె పక్కన పెట్టింది. అంతేకాకుండా దీక్షాత్‌ పాండ్యాతో(Dikshat Pandya) ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త జంట జెట్‌పురాలో జరిగే వివాహానికి 4 రోజుల క్రితం వెళ్లారు. ఈ పెళ్లిలో ఆ యువతిని గుర్తించిన స్నేహితులు మోహిసిన్‌కు సమాచారం అందించారు. దీంతో ఆమెకు మోహిసిన్‌ కంటిన్యూగా కాల్స్ చేశాడు. దీంతో అక్కడి నుంచి సెక్స్‌వర్కర్, దీక్షత్‌ ఓ కారులో వెళ్లిపోయారు. మోహిసిన్‌ ఫోన్‌ చేస్తూనే ఉండడంతో యువతి ఫోన్‌కు దీక్షత్‌ ఆన్సర్‌ చేశాడు. ఆ యువతితో నీకేంటి సంబంధంమని దీక్షత్ మోహిసిన్‌ను ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ యువతి తన దగ్గరే ఉంటుంది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని దీక్షాత్ అన్నాడు. దీంతో నీకు దమ్ముంటే ఆ యువతిని నా దగ్గరికి తీసుకురా అని మోహిసిన్‌ను ప్రశ్నించాడు. యువతిని తీసుకొని భావ్‌ఘర్‌కు వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న మోహిసిన్‌ దీక్షాత్‌పై నాలుగురౌండ్లు తుపాకీతో కాల్చి పరారయ్యాడు. తన రెండో ప్రియుడు హత్యకు గురవడంతో యువతి సైతం అక్కడి నుంచి పరారైంది. ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు మోహిసిన్‌ కోసం గాలిస్తున్నా

Updated On 26 Jan 2024 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story