పులో(Tiger), చిరుతనో ఎదురుపడితే ఏం చేస్తాం? గజగజమని వణికిపోతాం! కంగారుపడి దాన్ని కంగారుపెడతాం. కానీ ఓ పన్నెండేళ్ల పిల్లోడు మాత్రం ఏమాత్రం తోటుపాటు పడలేదు. చిరుత కంటే చురుకుగా వ్యవహరించాడు. అది కూడా చాలా కూల్‌గా! ఇది చెబితే ఎవరూ నమ్మరు కానీ సీసీ టీవీలో రికార్డయ్యింది కాబట్టి నమ్మి తీరాలి

పులో(Tiger), చిరుతనో ఎదురుపడితే ఏం చేస్తాం? గజగజమని వణికిపోతాం! కంగారుపడి దాన్ని కంగారుపెడతాం. కానీ ఓ పన్నెండేళ్ల పిల్లోడు మాత్రం ఏమాత్రం తోటుపాటు పడలేదు. చిరుత కంటే చురుకుగా వ్యవహరించాడు. అది కూడా చాలా కూల్‌గా! ఇది చెబితే ఎవరూ నమ్మరు కానీ సీసీ టీవీలో రికార్డయ్యింది కాబట్టి నమ్మి తీరాలి. పైగా ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social) వైరల్‌ అవుతున్నాయి. నాసిక్‌లో(Nasik) మాలేగావ్‌లో(Malegaon) ఈ ఘటన చోటు చేసుకుంది. మోహిత్‌ అహిరే అనే పన్నెండేళ్ల పిల్లోడు ఓ మ్యారేజ్‌ హాల్‌ క్యాబిన్‌ డోర్‌ దగ్గర ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకుంటున్నాడు. ఇంతలో అడుగులో అడుగు వేసుకుంటూ ఓ చిరుత ఇంట్లోకి దూరింది. మోహిత్‌కు దగ్గర్నుంచే అది వెళ్లింది. వేరే వాళ్లయితే అరచి కేకలు పెట్టి నానా గందరగోళం చేసేవారు. కానీ మోహిత్‌ మాత్రం నెమ్మదిగా అక్కడ్నుంచి లేచి చప్పుడు చేయకుండా బయటకు వచ్చేసి తలుపు గడియ పెట్టేశాడు. ఆ బుడ్డోడు రియాక్ట్‌ అయిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మోహిత్‌ తండ్రి ఓ మ్యారేజ్‌ హాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్‌లోనే దానిని బంధించి ఉంచారు.

Updated On 6 March 2024 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story