గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఫైనల్‌ పోరును ప్రధాని నరేంద్రమోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith Shah)లు కూడా వీక్షించారు. మ్యాచ్‌ అయిపోయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లను ఓదార్చారు మోదీ. ఆ సందర్భంగా ఆ టోర్నీలో అద్భుత ప్రతిభను కనబర్చిన మహమ్మద్‌ షమి(Mohammad Shami)ని దగ్గరకు తీసుకుని భుజం తట్టారు.

గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఫైనల్‌ పోరును ప్రధాని నరేంద్రమోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amith Shah)లు కూడా వీక్షించారు. మ్యాచ్‌ అయిపోయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లను ఓదార్చారు మోదీ. ఆ సందర్భంగా ఆ టోర్నీలో అద్భుత ప్రతిభను కనబర్చిన మహమ్మద్‌ షమి(Mohammad Shami)ని దగ్గరకు తీసుకుని భుజం తట్టారు. షమిని పార్టీలోకి తీసుకుంటారేమోనని అప్పుడే చాలా మంది డౌటొచ్చేసింది. ఆ అనుమానం ఇప్పుడు నిజం కాబోతున్నది. షమీ బీజేపీలో చేరనున్నట్టు నేషనల్ మీడియా కూస్తున్నది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షమి బెంగాల్‌ నుంచి పోటీ చేయనున్నాడని జాతీయ మీడియా చెబుతోంది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ఈ క్రికెటర్లను సంప్రదించిందట! చర్చలు సానుకూలంగా జరిగాయట! పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి షమిని పోటీలో దింపాలని బీజేపీ భావిస్తోంది. మైనారిటీ ఓట్లను ఆకర్షించడం కోసం బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. బసిర్‌హత్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున నుస్రత్‌ జహాన్‌ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. ఈ మధ్యనే షమి తన కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నెలాఖరులో మొదలు కాబోతున్న ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి షమి దూరమయ్యాడు. తన సర్జరీ విషయాన్ని షమి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినప్పుడు మోదీ కూడా రియాక్టయ్యారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated On 8 March 2024 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story