తండ్రి కొడుకులిద్దరూ హైదరాబాద్‌ పోలీసులకు వాంటెడ్‌గా మారడం విచిత్రం. ఆ తండ్రికొడుకులెవరంటే మహ్మద్‌ షకీల్‌ అమీర్‌(Mohammed Shakeel Amir) అలియాస్‌ బోధన్‌ షకీల్‌(Bodhan Shakeel), సాహిల్‌.. అప్పట్లో అంటే 2007లో బోధన్‌ షకీల్‌ నకిలీ పాస్‌పోర్ట్స్‌ కేసులో(Fake Passport) పోలీసులకు వాంటెడ్‌గా మారితే, ఆయన కొడుకు సాహిల్‌(Saheel) తాజాగా ప్రజాభవన్‌(Prajabhavan) దగ్గర చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో(BMW  Car Accident) నిందితుడిగా మారాడు. పదహారేళ్ల కిందట తండ్రి కోసం పరుగులు తీసిన నగర పోలీసులు ఇప్పుడు కొడుకు కోసం గాలిస్తున్నారు. సాహిల్‌ దుబాయ్‌కు పారిపోవడంతో అతడిపై ఎల్‌ఓసీ(LOC) జారీ చేశారు.

తండ్రి కొడుకులిద్దరూ హైదరాబాద్‌ పోలీసులకు వాంటెడ్‌గా మారడం విచిత్రం. ఆ తండ్రికొడుకులెవరంటే మహ్మద్‌ షకీల్‌ అమీర్‌(Mohammed Shakeel Amir) అలియాస్‌ బోధన్‌ షకీల్‌(Bodhan Shakeel), సాహిల్‌.. అప్పట్లో అంటే 2007లో బోధన్‌ షకీల్‌ నకిలీ పాస్‌పోర్ట్స్‌ కేసులో(Fake Passport) పోలీసులకు వాంటెడ్‌గా మారితే, ఆయన కొడుకు సాహిల్‌(Saheel) తాజాగా ప్రజాభవన్‌(Prajabhavan) దగ్గర చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో(BMW Car Accident) నిందితుడిగా మారాడు. పదహారేళ్ల కిందట తండ్రి కోసం పరుగులు తీసిన నగర పోలీసులు ఇప్పుడు కొడుకు కోసం గాలిస్తున్నారు. సాహిల్‌ దుబాయ్‌కు పారిపోవడంతో అతడిపై ఎల్‌ఓసీ(LOC) జారీ చేశారు. పంజాగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్‌జోన్‌ పోలీసులు గత ఏడాది జూబ్లీ హిల్స్‌ పరిధిలో జరిగిన మరో ప్రమాదానికి సంబంధించిన ఫైల్‌ను బయటకు తీస్తున్నారు. 2007లో నకిలీ పాస్‌పోర్ట్స్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మనుషులను అక్రమంగా రవాణా చేసేవారు షకీల్‌. అమెరికాతో పాటు కొన్ని ఐరోపా దేశాలలో గుజరాతీయులకు ప్రవేశం ఉండేది కాదు. దాంతో ఆ గుజరాత్‌కు చెందిన వారిని అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా కొన్ని ముఠాలు వెలిశాయి. ఈ ముఠా సభ్యులు ప్రజా ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకునేవారు. గుజరాతీయులను వారి కుటుంబంలో సభ్యులుగా మార్చేవారు. ఆ ప్రతినిధుల రికమెండేషన్‌తో గుజరాతీయుల(Gujarat) పేర్లు మార్చేసి ఆ పేరుతో నకిలీ పాస్‌పోర్టులు ఇచ్చేవారు. చాన్నాళ్లపాటు సాగిన ఈ కుంభకోణం ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్‌ కటారా అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ను చూసి పోలీసులే బిత్తరపోయారు. హైదరాబాద్‌లో నమోదైన కేసులో బోధన్‌ షకీల్‌ నిందితుడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్(Central crime station) పోలీసులు ఇతడి కోసం ముమ్మరంగా వెతికి చివరికి పట్టుకోగలిగారు. ఇది జరిగిన పదహారేళ్ల తర్వాత ఆయన కొడుకు ప్రమాదం కేసులో చిక్కుకున్నాడు. పోలీసులకు దొరక్కుండా దుబాయ్‌కు పారిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజాభవన్‌ దగ్గర నిర్లక్ష్యంగా బీఎండబ్ల్యూ కారును నడిపి ప్రజా ఆస్తులను ధ్వంసం చేశాడు సాహిల్‌. ఈ కేసు నుంచి సాహిల్‌ను తప్పించడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి సీరియస్‌ అయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. పరారీలో ఉన్న సాహిల్ కోసం వెతుకుతున్నారు. షకీల్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇంతకు ముందు కూడా సాహిల్‌ ఓ యాక్సిడెంట్‌ చేశాడు. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ వైపుకు దూసుకువచ్చిన మహేంద్రథార్‌ కారు బుగ్గలు అమ్ముకుంటున్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్‌ చౌహాన్‌, సారికా చౌహాన్‌, సుష్మ భోస్లేలు తీవ్రంగా గాయపడ్డారు. రెండు నెలల ప్రాయం ఉన్న కాజల్‌ కుమారుడు అశ్వతోష్‌ చనిపోయాడు. ఆ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్‌ ఉండటంతో సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు షకీల్‌ ఓ మీడియా మెసేజ్‌ విడుదల చేశాడు. అందులో ఆ కారు తనది కాదని, తన కజిన్‌దని చెప్పారు. పసిబిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్‌కు చెప్పానని పేర్కొన్నాడు. ఈ కేసులో పోలీసులు కూడా సాహిల్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. తాజాగా పంజాగుట్ట కేసు తర్వాత ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్‌ కేసును తిరగదోడుతున్నారు. అప్పటి ప్రమాదంలో సాహిల్‌ పాత్ర ఉందా? లేక ఏదైనా మతలబు జరిగిందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 27 Dec 2023 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story