బీహార్ (Bihar)రాష్ట్రంలో అనేక రకాల దొంగతనాలు ,దోపిడులు జరిగిన వార్తలు నిత్యం మనం వింటూనే ఉంటాం . కానీ తాజాగా ఇక్కడ ఏకంగా మొబైల్ టవర్ (Mobile Tower)నే దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది . కొద్ది రోజుల క్రితం జనవరిలో బీహార్ రాజధాని పాట్నాలో(Patna) మొబైల్ టవర్ చోరీకి గురైంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే బీహార్ లోని మరో జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌(Mujafi pur) శ్రమజీవి నగర్‌లో మొబైల్ టవర్ దొంగతనం జరిగింది . ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేయటం ప్రారంభించారు.ఈ విషయం పైన శుక్రవారం (ఏప్రిల్ 14) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని కొందరి వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం జరిగింది .

బీహార్ (Bihar)రాష్ట్రంలో అనేక రకాల దొంగతనాలు ,దోపిడులు జరిగిన వార్తలు నిత్యం మనం వింటూనే ఉంటాం . కానీ తాజాగా ఇక్కడ ఏకంగా మొబైల్ టవర్ (Mobile Tower)నే దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది . కొద్ది రోజుల క్రితం జనవరిలో బీహార్ రాజధాని పాట్నాలో(Patna) మొబైల్ టవర్ చోరీకి గురైంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే బీహార్ లోని మరో జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌(Mujafirpur) శ్రమజీవి నగర్‌లో మొబైల్ టవర్ దొంగతనం జరిగింది . ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేయటం ప్రారంభించారు.ఈ విషయం పైన శుక్రవారం (ఏప్రిల్ 14) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని కొందరి వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ (FIR)నమోదు చేయటం జరిగింది .

శ్రమజీవి నగర్‌కు (Shrama jeevi nagar)చెందిన మనీషా కుమారి నివాస ప్రాంతంలో జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(GTL Infrastructure ltd) మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసింది . కొద్దిరోజుల పాటు టవర్ మూసి వేయటం జరిగింది . టవర్ కంపెనీ యొక్క ఆఫీస్ బేరర్, Mohd. షానవాజ్ (md.shanvaj)అన్వర్ అక్కడకి వెళ్లగా టవర్‌తో పాటు, అనేక ఇతర పరికరాలు కూడా కనిపించలేదు ఇది కాకుండా, షెల్టర్, డీజిల్ జనరేటర్, SMPF, స్టెబిలైజర్ మొదలైన పరికరాలు కూడా కనిపించకుండా పోయాయి . వాటి ఖరీదు దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుందని అంచనా .Mohd. షానవాజ్ అన్వర్ దీంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు

అదే సమయంలో, ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు షాకింగ్ విషయాలను చెప్పారు . కొద్దిరోజుల క్రితం మొబైల్‌ టవర్‌ను (Mobile Tower)తెరవడానికి కొందరు వచ్చినట్లు చెప్పారు .మొత్తం 5 మంది వచ్చి మొబైల్ టవర్ తెరిచి తీసుకున్నట్లు ,ఆలాగే దానిని ట్రక్కులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు అని స్థానికులు తెలిపారు . పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేస్తున్నారు .

Updated On 15 April 2023 5:50 AM GMT
rj sanju

rj sanju

Next Story