సచివాలయ(Secretariat) ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) విగ్రహం ఏర్పాటు విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి ఆమె శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు.

MLC Kavitha
సచివాలయ(Secretariat) ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) విగ్రహం ఏర్పాటు విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి ఆమె శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని కవిత తెలిపారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, అయితే తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమని కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
