బిల్కిస్ బానో(Bilkis Bano) దోషుల నిర్దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు(supreme court) ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్వాగతించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ట్వీట్(Tweet) చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ..
బిల్కిస్ బానో(Bilkis Bano) దోషుల నిర్దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు(supreme court) ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్వాగతించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ట్వీట్(Tweet) చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. బాధితురాలి బాధ వర్ణనాతీతమని, ఈ తీర్పు దేశానికి బలమైన సందేశాన్ని పంపిస్తుందని ఆమె అన్నారు. మహిళల సమగ్రత పట్ల తిరుగులేని నిబద్ధత, న్యాయం గెలుస్తుందన్నారు. మన దేశం మహిళలకు అండగా నిలుస్తుందడనానికి ప్రతీ తీర్పు ఉదాహరణ అని కవిత ట్వీట్ చేశారు. సుప్రీం
కాగా బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేసిన 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని తెలిపింది. దోషులు రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.