అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఓ రిపోర్టు విడుదల చేసింది.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఓ రిపోర్టు విడుదల చేసింది. దేశంలో అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది. ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా(BJP MLA Parag Shah)కు దేశంలోని అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ రూ.3,400 కోట్లు. ఆయన భారత్(India)లోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే. ఆయన తర్వాత కర్ణాటక(Karnataka)లోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) సంపద రూ.1,413 కోట్లకు పైగా ఉందని ఏడీఆర్ తెలిపింది. అందరికంటే తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఇండస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా(BJP MLA Nirmal Kumar Dhara) నిలిచారు. ఆయన ఆస్తులు కేవలం రూ.1,700 మాత్రమే. ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 4,092 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా ఆస్తుల చిట్టాను వివరించింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu): రూ.931 కోట్లు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan): రూ.757 కోట్లు, కె.హెచ్. పుట్టస్వామి గౌడ(KH Putta swamy Goud), కర్ణాటక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే: రూ.1,267 కోట్లు, ప్రియకృష్ణ(Priya krishna), కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే: రూ.1,156 కోట్లు, పి.నారాయణ(P.narayana), ఏపీ టీడీపీ ఎమ్మెల్యే: రూ.824 కోట్లు, వి. ప్రశాంతి రెడ్డి(v.Prashanth Reddy), ఏపీ టీడీపీ ఎమ్మెల్యే: రూ.716 కోట్లు. టాప్ పదిలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచే నలుగురు ఉన్నారు. టాప్ 20లో ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hero Bala Krishna)కూడా ఉన్నారు
