కర్నాటకలో(Karnataka) విషాదం చోటు చేసుకుంది. యాదగిరి నగర(Yadagiri nagar) పోలీసుస్టేషన్ ఎస్‌ఐ(SI) పరశురాం శుక్రవారం రాత్రి గుండెపోటుతో(Heart attack) చనిపోయారు.
కర్నాటకలో(Karnataka) విషాదం చోటు చేసుకుంది. యాదగిరి నగర(Yadagiri nagar) పోలీసుస్టేషన్ ఎస్‌ఐ(SI) పరశురాం శుక్రవారం రాత్రి గుండెపోటుతో(Heart attack) చనిపోయారు. 29 ఏళ్ల వయసులోనే ఆయన అనంతలోకాలకు తరలివెళ్లడంతో బంధుమిత్రులు ఆవేదన చెందుతున్నారు. పరశురాం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే యాదగిరి స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న పరశురాం ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్(Transfer) అయ్యారు. రాత్రి ఆయనకు సన్మానం చేశారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంటికెళ్లి పడుకున్న ఆయన నిద్రలోనే చనిపోయారు. తన భర్త మరణంపై భార్య శ్వేత రియాక్టయ్యారు. తన భర్త పరశురాం ట్రాన్స్‌ఫర్ కోసం ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారని, ఏడు నెలల కిందట 30 లక్షల రూపయాలు ఇస్తే యాదగిరి పోలీసు స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. ఎన్నికలు(eletions) అయ్యాక మళ్లీ యాదగిరి నగరానికి వచ్చి చేరారు. ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్లు అవుతుండటంతో ఎమ్మెల్యే మరోమారు డబ్బులు డిమాండ్ చేశారని, ఏడు నెలల క్రితం చేసిన అప్పులకే వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నామని శ్వేత తెలిపారు. రెండేళ్ల కిత్రం వీరి పెళ్లి జరిగింది. ఏడాది కొడుకున్నాడు. ప్రస్తుతం శ్రేత గర్భిణి. ఇదిలా ఉంటే పరశురాం మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరశురాం మరణం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని హోం మంత్రి జి.పరమేశ్వర్ ఆదేశించారు.