రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు(Rajasthan Assembly Elections) పక్షం రోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులంతా ప్రచారంలో(Campaign) బిజీ అయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఊరువాడా తిరుగుతున్నారు. మరోవైపు పలు స్థానాలలో బంధువుల మధ్య పోటీలు జరుగుతుండటంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు(Rajasthan Assembly Elections) పక్షం రోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులంతా ప్రచారంలో(Campaign) బిజీ అయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఊరువాడా తిరుగుతున్నారు. మరోవైపు పలు స్థానాలలో బంధువుల మధ్య పోటీలు జరుగుతుండటంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రక్తసంబంధీకుల దగ్గర్నుంచి దగ్గర బంధువుల వరకు ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. ఓ చోట భార్యాభర్తలు, మరోచోట బావామరదళ్లు, ఇంకొన్ని చోట్ల బాబాయ్‌ అబ్బాయ్‌లు పోటీపడుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఓ చోట తండ్రీ కూతుళ్లు పరస్పరం పోటీపడుతున్నారు. దాంతారాంగఢ్ నియోజకవర్గం(Dantarangad Constituency) ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌(Congress) తరఫున వీరేంద్రసింగ్‌(Virendra singh) పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీ చేస్తున్నది ఆయన భార్య రీటా(Rita) కావడంతో ఆసక్తి పెరిగింది. జన్‌ నాయక్‌ జనతా పార్టీ నుంచి రీటా పోటీ చేస్తున్నారు. వీరేంద్ర సింగ్‌ తండ్రి నారాయణ్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అగ్రనేత! 2018లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమారుడు వీరేంద్రకు టికెట్‌ ఇప్పించి గెలిపించుకున్నారు.

అయితే కొంతకాలంగా భార్య రీటాతో వీరేంద్రకు గొడవలు జరుగుతున్నాయి. విడాకులు(Divorce) అయితే తీసుకోలేదు కానీ చాన్నళ్ల నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఎన్నికలు రాగానే భర్తపైనే పోటీకి దిగారు రీటా! వీరేంద్రను ఓడించడమే లక్ష్యంగా ఆమె ముందుకు వెళుతున్నారు. ఇక ధోల్‌పూర్‌ నియోజకవర్గంలో(Dholpur Constituency) బావమరదళ్లు(cousins) పోటీపడుతున్నారు. బీజేపీ(BJP) తరఫున శివచరణ్‌ కుష్వాహా(Sivacharan Kushwaha) పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌(congress) తరఫున ఆయన మరదలు శోభారాణి(shobha Rani) రంగంలోకి దిగారు. అన్నింటికంటే ఆళ్వార్‌ రూరల్ నియోజకవర్గంపై అందరికీ ఆసక్తి పెరిగింది.

ఇక్కడ నుంచి బీజేపీ టికెట్‌పై జయరామ్‌ జాటవ్‌(Jayaram Jatav) పోటీ చేస్తున్నారు. ఆయనతో గొడవపడిన కూతురు మీనాకుమారి(Meena Kumari) స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. తండ్రినే సవాల్‌ చేస్తున్నారు. ప్రచారంలో ఇద్దరూ పరస్పరం జోరుగా విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తంమీద ఓటర్లకు మాత్రం ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తున్నారు. భాద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సంజీవ్‌ బెనీవాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆయన అన్న కుమారుడు అజిత్ బెనీవాల్‌ బరిలో దిగారు. చిన్నాన్నకు పోటీనిస్తున్నారు.

ఖెత్డీ అసెంబ్లీ స్థానంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ్నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మనీషా గుజ్జర్‌ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆమె బాబాయ్‌ ధర్మపాల్‌ బరిలో దిగారు. నాగౌర్‌లో బీజేపీ తరఫున జ్యోతీ మీర్ధా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆమెకు చిన్నాన్న వరసయ్యే హరేంద్ర మీర్ధా పోటీ చేస్తూ ఆమెకు సవాల్‌ విసురుతున్నారు. సోజత్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ ఆర్య పోటీ చేస్తుంటే, బీజేపీ తరఫున ఆయన దగ్గర బంధువు శోభా చౌహాన్‌ పోటీలో దిగారు. బస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో మరో రకం పోటీ నెలకొంది.

ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్‌ చంద్రమోహన్‌ మీనా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ మీనా బరిలో దిగారు. చిత్రమేమిటంటే వీరిద్దరు దగ్గర చుట్టాలుకావడం. ఖండార్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌పై అశోక్‌ బైర్వా పోటీ చేస్తున్నారు. తండ్రి డాల్‌చంద్‌తో ఆయన గొడవలు ఉన్నాయి. ఇదే మంచి తరుణమనుకున్న తండ్రి డాల్‌చంద్‌ అతడిని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నా కొడుకుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా అశోక్‌కు పెద్ద కష్టమే వచ్చిపడింది.

Updated On 10 Nov 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story