సచిన్‌ తెందూల్కర్‌(sachin tendulker) అద్భుతమైన క్రికెటరే! ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అతడిలో ఈ విద్వత్తును చూసే కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో(Bharath Ratna) సత్కరించింది. భారతరత్న అందుకున్న వ్యక్తులు కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. మహారాష్ట్రకు చెందిన ప్రహార్‌ జనశక్తి ఎమ్మెల్యే బచ్చూ కాడూ(MLA Bacho Kadoo Protest ) కూడా ఇదే మాట అంటున్నారు.

సచిన్‌ తెందూల్కర్‌(sachin tendulkar) అద్భుతమైన క్రికెటరే! ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అతడిలో ఈ విద్వత్తును చూసే కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో(Bharath Ratna) సత్కరించింది. భారతరత్న అందుకున్న వ్యక్తులు కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. మహారాష్ట్రకు చెందిన ప్రహార్‌ జనశక్తి ఎమ్మెల్యే బచ్చూ కాడూ(MLA Bacho Kadoo) కూడా ఇదే మాట అంటున్నారు. అనడమే కాదు, ముంబాయిలో సచిన్‌ ఉంటి ముందుకు తన అనుచరులతో కలిసి నిరసన కూడా చేపట్టారు. ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న సచిన్‌ యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ప్రచారం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. భారతరత్న పుస్కారాన్ని సచిన్‌ తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్ గేమ్స్‌ ప్రచార ప్రకటనల నుంచి సచిన్‌ వైదొలగకపోతే మాత్రం ప్రతి గణేశ్‌ మండపం ముందు ధర్నా చేస్తామని ప్రకటించారు. షరా మామూలుగా పోలీసులు అక్కడికి వచ్చి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులను అక్కడి నుంచి తరలించారు. బచ్చూ కాడూతో పాటు 22 మందిపై కేసులు కూడా పెట్టారు.

Updated On 2 Sep 2023 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story