☰
✕
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.
x
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. తన మధుర గానంతో ఎంతోమందిని అలరించిన ఆ పాటల రారాజును మనం, అంటే తెలుగువాళ్లం పెద్దగా గౌరవించుకోలేదు. తమిళనాడు(Tamilnadu)మాత్రం ఆయనను ఎంతో ఆరాధించింది. అభిమానించింది. ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్(Kamdar Nagar)మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam)’పేరు పెట్టనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(CM MK Stalin) ప్రకటించారు. ఇక నుంచి ఆ రహదారిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌వేదికగా స్టాలిన్ పోస్ట్ పెట్టారు. సీఎం స్టాలిన్ నిర్ణయం పట్ల బాలసుబ్రహ్మణ్యం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ehatv
Next Story