తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి. మూలాల ప్రకారం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వచ్చే రెండు వారాల్లో జరగవచ్చని తెలుస్తోంది. త‌న క్యాబినెట్ లోని ఓ మంత్రి ఆడియో టేపు వ్య‌వ‌హార‌మై సీరియ‌స్‌గా ఉన్న‌ సీఎం స్టాలిన్ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి. మూలాల ప్రకారం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ(Cabinet Reshuffle) వచ్చే రెండు వారాల్లో జరగవచ్చని తెలుస్తోంది. త‌న క్యాబినెట్ లోని ఓ మంత్రి ఆడియో టేపు వ్య‌వ‌హార‌మై సీరియ‌స్‌గా ఉన్న‌ సీఎం స్టాలిన్ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

రాష్ట్ర మంత్రివర్గంలో ప్ర‌స్తుతం 53 మంది మంత్రులు ఉన్నారు. ఆశావ‌హుల గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జ‌రుగుతుంది. మరోవైపు పనితీరు సరిగా లేని ఇద్దరు మంత్రులను కూడా రాజీనామా చేయమని కోరే అవకాశం ఉందని కొందరు నేతలు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రెండు, మూడు బెర్తులు ఖాళీ అవ‌నున్నాయి.

మీడియా కథనాల ప్రకారం.. మన్నార్గుడి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డీఎంకే ఎమ్మెల్యే టీఆర్‌బీ రాజా(TRB Raja)ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని కొంతమంది డీఎంకే(DMK) నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజా.. కేంద్ర మాజీ మంత్రి టీఆర్‌ బాలు కుమారుడు. మంత్రివర్గంలో చోటు ఖ‌య‌మ‌ని విన‌ప‌డుతున్న వారిలో శంకరన్‌కోవిల్‌(Sankarankovil) ఎమ్మెల్యే ఇ రాజా(E Raja) పేరు కూడా ఉంది.

ప్ర‌స్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న‌ డాక్టర్ పళనివేల్ త్యాగ రాజన్(Palanivel Thiaga Rajan) (పీటీఆర్) ఈ మంత్రివ‌ర్గ‌ పునర్వ్యవస్థీకరణను తట్టుకుని నిలబడగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత వారం పీటీఆర్ ఆడియో ఫైళ్ల(Audio Files)ను చీప్ పాలిటిక్స్(Cheap Politics) అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్(Cheif Minister Stalin) కొట్టిపారేశారు. ఈ ఆడియోలో స్టాలిన్ కుటుంబ సంపదపై మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విష‌య‌మై సీరియ‌స్‌(Serious)గా ఉన్న సీఎం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

Updated On 8 May 2023 10:01 PM GMT
Yagnik

Yagnik

Next Story