ఏపీ నుంచి డీలిమిటేషన్ విషయంలో ఇప్పటిదాకా రియాక్ట్ అయిన తొలి పార్టీ వైసీపీయే.

ఏపీ నుంచి డీలిమిటేషన్ విషయంలో ఇప్పటిదాకా రియాక్ట్ అయిన తొలి పార్టీ వైసీపీయే. పైగా ఆ పార్టీ ఎన్డీయే(NDA)కు దూరంగా ఉంది. దాంతో డీఎంకే(DMK) అధినేత స్టాలిన్ (Mk Stalin)మాతో వైసీపీ కలసివస్తుందని భావించి ఉండొచ్చని అంటున్నారు. అయితే వైసీపీ(YCP) ఈ విషయంలో కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తూనే లేఖ రాసింది. దక్షిణాదికి అన్యాయం చేయవద్దు అని కోరింది. అదే సమయంలో కేంద్రం మీద ఘాటు విమర్శలు చేయలేదు.

ఇక కేవలం డీలిమిటేషన్ మాత్రమే కాదు జీఎస్టీ(GST) ద్వారా కేంద్రం రాష్ట్రాలకు పంచుతున్న పన్నుల విషయంలో సాగుతున్న వివక్ష మీద కూడా డీలిమిటేషన్ జేఏసీ (Delimitation JAC)మీటింగులో మిగిలిన పార్టీలు గొంతెత్తాయి. మరి దీని మీద వైసీపీ స్టాండ్ ఏమిటో చెప్పలేదు. అదే విధంగా చాలా కాలంగా దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ పాలనలో వివక్ష కొనసాగుతోందని జేఏసీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ అభిప్రాయాలు ఏమిటి అన్నవి తెలియవు.

డీలిమిటేషన్ అన్న హాట్ టాపిక్ ని జేఏసీ ఎత్తుకున్నా టోటల్ గా చూస్తే సౌత్ స్టేట్స్ మీద కేంద్రం వివక్ష మీద కలసికట్టుగా పోరాడాలన్నది అజెండా. మరి ఈ విషయంలో వైసీపీ ఎంతవరకు కలసివస్తుందన్నది చూడాల్సి ఉంది. నిజానికి వైసీపీ ఈ కూటమితో కలసి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా పోరాడేందుకు ఏ విధమైన అడ్డంకులు అయితే లేవు.

ఎందుకంటే ఎన్డీయేతో వైసీపీకి ఎలాంటి బంధాలు లేవు. ఫ్యూచర్ లో కూడా కుదిరే చాన్స్ లేదు. మరి లోపాయికారీగా ఉన్నాయని అనుకున్నా అదంత సులువు కాదు. ఏపీలో టీడీపీ జనసేన వైసీపీకి బద్ధ రాజకీయ ప్రత్యర్ధులు. వారిని కాదని బీజేపీ ఏ విధంగానూ వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించేందుకు వీలు లేదు అని అంటున్నారు.

కానీ వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. బయటపడి మోడీ వ్యతిరేక శిబిరంలో చురుకుగా ఉంటే ఆ విపరిణామాలు ఎలా ఉంటాయో అన్న అంచనా వేసుకుని ఇలా చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ మా వైపే అన్న స్టాలిన్ వ్యాఖ్యల మీద ఫ్యాన్ పార్టీ ఎంతవరకూ ఆమోదముద్ర వేస్తుంది అన్నది రానున్న రోజులలో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

ehatv

ehatv

Next Story