విపక్షాల భేటీ శుక్రవారం ముగిసింది. కానీ అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం పాట్నాకు(Patna) వచ్చిన బాగేశ్వర్ ధామ్‌కు(Bageshwar Dham) చెందిన బాబా ఫోటో మాదిరిగానే ఈ ఫోటో వైరల్(viral) అవుతోంది. ఇందులో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK stalin), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్(Deputy CM Tejaswi Yadav) సఫారీ వాహనంలో కూర్చున్నారు.
విపక్షాల భేటీ శుక్రవారం ముగిసింది. కానీ అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం పాట్నాకు(Patna) వచ్చిన బాగేశ్వర్ ధామ్‌కు(Bageshwar Dham) చెందిన బాబా ఫోటో మాదిరిగానే ఈ ఫోటో వైరల్(viral) అవుతోంది. ఇందులో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK stalin), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్(Deputy CM Tejaswi Yadav) సఫారీ వాహనంలో కూర్చున్నారు. ఈ ఇద్దరు నేతలు సీటు బెల్ట్(Seat belt) లేకుండా కారులో వెళ్తున్నందున ఈ ఫోటో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు వారిని ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను(Rules) ఉల్లంఘిస్తున్నారని కొందరు.. వారి నుంచి ఫైన్(Fines) వసూలు చేసే ధైర్యం ఎవరికి ఉందని కొందరు.. పాట్నా ట్రాఫిక్ పోలీసులు(patna Trffic Police) వీరికి జరిమానా విధించాలని మరికొందరు అంటున్నారు.
బీహార్‌లో(Bihar) ఈ వ్యవహారంపై రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ(BJP) నేత నిఖిల్ ఆనంద్(Nikhil Anand) ఈ విషయాన్ని లేవనెత్తుతూ ట్వీట్(Tweet) చేస్తూ.. మళ్లీ మళ్లీ చూడు, వెయ్యి సార్లు చూడండి.. రాజు కొడుకు పరిపాలిస్తాడు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తాడు. లాలూజీ ల్యాప్ లీడర్ నితీష్‌జీ పాలనలో రాకుమారులకు ట్రాఫిక్ నిబంధనల నుండి మినహాయింపు ఉందా.? అని ప్రశ్నించారు. బాబా బాగేశ్వర్ సీటు బెల్ట్ ఉపయోగించనందుకు జరిమానా విధించారు. ఇప్పుడు నీ నీతి ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.
బాగేశ్వర్‌కు చెందిన బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి పాట్నా విమానాశ్రయం నుంచి హోటల్‌కు వచ్చిన వాహనంపై జరిమానా విధించారు. బాబా వెంట బీజేపీ ఎంపీలు గిరిరాజ్ సింగ్(Giriraj Singh), మనోజ్ తివారీ(Manoj Tiwari) ఉన్నారు. బాబా కారును మనోజ్ తివారీ నడుపుతున్నారు. వెనుక సీటులో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూర్చున్నారు. పాట్నా విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లే సమయంలో ముగ్గురిలో ఎవరూ సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు పాట్నా ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఫిర్యాదు నిర్ధారణ అవడంతో జరిమానా విధించారు.