మిస్ ఇండియా త్రిపుర(Miss India Tripura) 2017 రింకీ చక్మా(Rinky Chamka) క్యాన్సర్‌తో పోరాడుతూ జీవితాన్ని చాలించింది. రింకీ చక్మా వయసు కేవలం 28 ఏళ్లే కావడం గమనార్హం. 2022 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్‌తో(Breast Cancer) రింకీ చక్మా పోరాడుతోంది. ఈ మధ్యనే మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది. మృత్యువుతో పోరాడి చివరికి తనువు చాలించారు. రెండేళ్ల క్రితం ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. క్రమక్రమంగా అది ఇతర అవయవాలకు వ్యాప్తి చెందడంతో ఆమె తుది శ్వాస విడిచారు. 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచారు.

2022లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకడంతో ఆమె చికిత్స తీసుకున్నారు. తొలుత తగ్గినట్లే తగ్గి మళ్లీ క్యాన్సర్ పెరగడం ప్రారంభించింది. ఆ తర్వాత ఊపిరితిత్తులు, తలకు క్యాన్సర్ వ్యాప్తి చెందడంతో ఎంతో శ్రమించి చికిత్స అందించినా ఫలితం లేదు. గత నెల 22న రింకీచక్మా ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.
కొన్ని వారాల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను పోస్టు చేసింది. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని ఆ వీడియోలో తెలిపింది. తనకు క్యాన్సర్ సోకిందని ఎవరికీ చెప్పొద్దని తొలుత అనుకున్నా కానీ.. రెండేళ్ల నుంచి దీనిపై పోరాడుతున్నానని తెలిపింది. తనకు ప్రాణాంతక ఫైలోడెస్ ట్యూమర్ (రొమ్ము క్యాన్సర్) ఉందని చెప్పింది. చికిత్స కోసం డబ్బులు కావాలని, ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయాలని ప్రాధేయపడింది.
ఆమె వైద్య ఖర్చుల కోసం ఆమె స్నేహితులు, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న వారు ఫండ్స్ సేకరించారు. కొన్ని రోజుల క్రితమే తన పోస్టు ద్వారా విరాళాలు కోరిన రింకీ చక్మా తుది శ్వాస విడిచిపెట్టడంతో కుటుంబసభ్యులు, ఆమె శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు.