✕
Sini Shetty : మిస్ వరల్డ్‌లో పాల్గొంటున్న మిస్ ఇండియా బ్యూటీ ఎవరో తెలుసా?
By EhatvPublished on 20 Feb 2024 5:28 AM GMT
ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు(Miss World competitions) మన దేశం ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన 71వ మిస్ వరల్డ్ ఎడిషన్(71 Miss world Edition) వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న కాంపిటిషన్లో 130కి పైగా దేశాల నుంచి అందాలభామలు వచ్చారు. అందాల కిరీటం దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.

x
Sini Shetty
-
- ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు(Miss World competitions) మన దేశం ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన 71వ మిస్ వరల్డ్ ఎడిషన్(71 Miss world Edition) వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న కాంపిటిషన్లో 130కి పైగా దేశాల నుంచి అందాలభామలు వచ్చారు.
-
- అందాల కిరీటం దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. మన దేశం నుంచి కన్నడ భామ సినీ షెట్టి(Sini shetty) మిస్ వరల్డ్ కోసం బరిలో దిగుతున్నారు. 21 ఏళ్ల సినీ షెట్టి ఆల్రెడీ ఢిల్లీలో అడుగుపెట్టారు.
-
- ముంబాయిలో(Mumbai) జన్మించిన సినీ షెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాల్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భరతనాట్యంలో కూడా ఈమెకు ప్రవేశం ఉంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నందున ఇండియాకు రిప్రసెంట్ చేయడం తనకు గర్వంగా ఉందని అంటున్నారు సినీ షెట్టి.
-
- తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జాతిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పారు. 'తూహీ మేరీ మంజిల్ హై, పెహచాన్ తుజ్హై' అని రాసుకొచ్చారు. ( నువ్వే నా లక్ష్యం, నువ్వే నా చిహ్నం అని అర్థం) ఈ ప్రయాణంలో నేను నా కంటే ఉన్నత స్థానంలో ఉన్నాను. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు, గుండెల్లో పెట్టుకున్నాను' అని గర్వంగా చెపారు సినీ షెట్టి.
-
- '71వ మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగు పడింది. నేను నా కలలతో అడుగులు వేస్తున్నాను. నేను నా దేశపు గర్వాన్ని. ఈ క్షణం నుంచి నేను సినీ షెట్టిని మాత్రమే కాదు. నేను భారతదేశాన్ని. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నన్న పెంచిన ఈ నేల, నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృత, నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని. నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా, గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను.
-
- ఇది నాకోసం, మన కోసం, భారతదేశం కోసం' అని సినీ షెట్టి క్యాప్షన్ పెట్టారు. నెటిజన్లు అమె విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ప్రార్థిస్తున్నారు. ఆమెకు శుభాభివందనాలు తెలుపుతున్నారు.
-
- 1966లో ఇండియాకు చెందిన రీటా ఫారియా మొదటిసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరి టైటిల్‌ను గెల్చుకున్నారు. 2022లో నిర్వహించిన పోటీలలో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజయం సాధించారు.
-
- ఇప్పుడు టైటిల్ గెల్చుకున్న వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందిస్తారు. మార్చి 9వ తేదీన ముంబాయిలో ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఆల్ ది బెస్ట్ సినీ షెట్టి!

Ehatv
Next Story