అనైతికత సంబంధంతో 12 ఏళ్లకే ఓ బాలిక గర్భం(Pregnant) దాల్చింది. అది కూడా సోదరుడితో(Brother) గర్భం దాల్చింది. గర్భం దాల్చిన కూతురికి అబార్షన్‌(Abortion) చేయాలని బాలిక తల్లిదండ్రులు కేరళ హైకోర్టును(Kerala High Court) ఆశ్రయించారు. అయితే గర్భం దాల్చి ఇప్పటికే 34 వారాలు అయితుందని.. ఈ సమయంలో అబార్షన్‌ చేయడం కష్టమని హైకోర్టు వారి పిటిషన్‌ను(Petetion) కొట్టివేసింది. సిజేరియన్ చేయాలా లేదా నార్మల్‌ డెలివరీ చేయాలా అన్నది వైద్యులకే వదిలేస్తున్నామని హైకోర్టు తెలిపింది.

తమ కూతురికి గర్భం ఉందని తమకు ముందే తెలియదని.. ఈమధ్యే తెలిసిందని.. బిడ్డకు జన్మనిస్తే శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలన్న బాలిక తల్లిదండ్రుల విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. మరో రెండువారాల్లో ప్రసవం అయ్యే అవకాశం ఉన్నందున అబార్షన్‌ చేయడాని వీల్లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. మైనర్‌ బాలిక తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంచాలని జస్టిస్‌ దేవన్‌ రామచంద్రన్‌(Justice Devan Ramachandran) ఆదేశించారు. సోదరిని గర్భవతిని చేసిన మైనర్ బాలుడికి దూరంగా ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా కోల్‌కత హైకోర్టు ఇదే తరహా తీర్పును వెల్లడించింది. రేప్‌కు గురైన 12 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించడానికి నిరాకరించింది. గర్భం దాల్చి 30 వారాలు దాటిన తర్వాత పిండాన్ని తొలగించలేమని స్పష్టం చేసింది.

Updated On 3 Jan 2024 5:21 AM GMT
Ehatv

Ehatv

Next Story