పార్లమెంట్(Parliament) భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్(Suspend) చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud) అన్నారు. పార్లమెంట్‌లో మొన్న ఆగంతకులు దూకి సభ్యులపై టియర్ గ్యాస్(Tear Gas) విడిచారు.. ఇది దేశ పార్లమెంటరి వ్యవస్థకే మచ్చ అని అన్నారు.
పార్లమెంట్(Parliament) భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్(Suspend) చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud) అన్నారు. పార్లమెంట్‌లో మొన్న ఆగంతకులు దూకి సభ్యులపై టియర్ గ్యాస్(Tear Gas) విడిచారు.. ఇది దేశ పార్లమెంటరి వ్యవస్థకే మచ్చ అని అన్నారు. తానీషా లాగా నియంత లాగా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం రావాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని.. భారతదేశ వ్యవస్థని చిన్నాబిన్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ అనుబంధ సంస్థలు సీబీఐ(CBI), ఈడీ(ED), ఐటీ దాడులు(IT rides) చేస్తారని అన్నారు.
మేము తెలంగాణ(Telangana) కోసం కొట్లాడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రభుత్వం 4 కాళ్ళు నియంతృత్వం మీదనే నడవాలని చూస్తుందన్నారు. ఇండియా అనే పదాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక్కటై నిరసిస్తున్నారని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలకు మేము దేశ భక్తులం అని చెప్పుకునే బీజేపీ ఎంపీలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై వ్యతిరేకంగా మాట్లాడినా.. పార్లమెంట్ మీద దాడి జరిగినా, సస్పెండ్ చేసినా తెలంగాణ బీజేపీ ఎంపీలు మాట్లాడరని అన్నారు. 13వ తేదీ జరిగిన దాడిపై ఇంతవరకూ ఎవరు స్పందించలేదన్నారు.
గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటే అవకాశం ఇచ్చారా.. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయమై అసెంబ్లీలో(Assembly) శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. కడియం శ్రీహరి మాట్లాడిన మాటలు కేటీఆర్, హరీష్ రావు చెప్పించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారింది.. దానికి అగుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు మార్పు కోరుకున్నారు.. మీరు చేసింది బంగారు తెలంగాణ అయితే.. ప్రజావాణి నుండి వేల పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఆటో కార్మికులకు అండగా ఉంటాం.. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 15 రోజుల్లో రివ్యూ చేస్తామని చెప్పామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్స్‌ను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.