భారతదేశంలోకి(India) టన్నుల కొద్దీ దొంగ బంగారం(Gold) వస్తూనే ఉంది. ఏటికేటికీ ఇది పెరుగూతూనే వస్తుంది. పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి(Pankaj Choudhary) ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం..ఈ ఏడాది అక్టోబరు వరకు దొంగ బంగారం సరఫరా చేస్తున్న స్మగ్లర్ల(Gold Smuglers) నుంచి మొత్తం 3,917.52 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా 4,798 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి.

2022లో 3.502.16 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా.. 2021లో 2,383 కిలోలు, 2020లో 2,154 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2023 అక్టోబర్ వరకు ప్రధానంగా మహారాష్ట్ర(Maharastra), తమిళనాడు(Tamilnadu), కేరళ(Kerala) రాష్ట్రాలకు బంగారం ఎక్కువగా అక్రమ రవాణా(Illegal Transportation) జరిగిందని సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో 1,357 కేసులు , తమిళనాడులో 894 కేసులు, కేరళలో 728 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జమ్ముకశ్మీర్, లేహ్, లడఖ్‌లలో బంగారం అక్రమ రవాణా కేసులు 577 నమోదయ్యాయి. బంగారం స్మగ్లింగ్ అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఒడిషా. ఈ రాష్ట్రంలో 2 కేసులు మాత్రమే నమోదుకావడం విశేషం. ఈ అక్రమరవాణాకు ముఖ్య కారణం దేశంలో బంగారం అమ్మకాలపై అధిక ట్యాక్స్ ఉండడం, దిగుమతలపై పరిమితులు ఉండడమే కారణమని మార్కెట్ వర్గాల విశ్లేషణ. అంతేకాకుండా కొన్ని దేశాల్లో బంగారానికి తక్కువ ధర ఉండడంతో అయా దేశాలనుంచి స్మగ్లింగ్ పెరిగిపోతుంది. బంగారం అక్రమరవాణా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఇది ఆపలేకపోతున్నారు. గత ఏడాది కంటే 20 శాతం అధికంగా బంగారం కేసులు నమోదు కావడం ఇందుకు ఉదాహరణగా చూడొచ్చు.