Vizag Six Lane Road : 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవేకు గడ్కరీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేడు నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. “చాలా కాలంగా సీఎం జగన్ 6 […]

minister nitin gadkari announces Vizag Six Lane Road in global summit
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేడు నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అదే సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందని కొనియాడారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. “చాలా కాలంగా సీఎం జగన్ 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవే కు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్ నా ముందు ఉంచారు. ఈ రహదారి 55 కిలోమీటర్ల మేర ఉంటుంది, మరియు ఖర్చు రూ.6300 కోట్లు అంచనా.” అని గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు సభా సమక్షంలో తెలిపారు. రాష్ట్ర అభివ్రుద్ధికి తన సహకారాన్ని అందించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
