రెండు వేల(2000rs note) రూపాయల నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఉపసంహరించుకోవడాన్ని బీజేపీయేతర(BJP) పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోదీ(Modi) సర్కార్‌ రెండు వేల రూపాయల నోటును ఎందుకు తెచ్చిందో, ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నదో ఎవరికీ అర్థం కావడం లేదని తెలంగాణ(Telangana) విద్యత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadish reddy) విమర్శించారు.

రెండు వేల(2000rs note) రూపాయల నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఉపసంహరించుకోవడాన్ని బీజేపీయేతర(BJP) పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోదీ(Modi) సర్కార్‌ రెండు వేల రూపాయల నోటును ఎందుకు తెచ్చిందో, ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నదో ఎవరికీ అర్థం కావడం లేదని తెలంగాణ(Telangana) విద్యత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadish reddy) విమర్శించారు. నోట్ల రద్దుతో మోదీ పాలనకు తిరోగమనం మొదలయ్యిందన్నారు.

అంతర్గతంగా ఉన్న రహస్య ఎజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌బీఐని ముందు పెట్టి ప్రజల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్ధికంగా దేశాన్ని దెబ్బతీసేందుకు మోదీ సర్కార్‌ పన్నిన పన్నాగమే నోట్ల రద్దు చర్య అని అన్నారు. పెట్టుబడి దారుల రహస్య ఎజెండాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పుకొచ్చారు జగదీశ్‌రెడ్డి. రెండు వేల రూపాయల నోటు ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated On 20 May 2023 12:17 AM GMT
Ehatv

Ehatv

Next Story