ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ మంత్రికి చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. కన్నౌజ్‌లోని(Kannauj) జసర్‌పురా సరయ్య(Jasarpura Saraiah) గ్రామంలో పంచాయతీ ప్రధాన కార్యదర్శి(Panchayat Chief Secretary)చేసిన పనికి మంత్రి బిత్తరపోయారు. పంచాయతీ కార్యాలయానికి మంత్రి అసీమ్ అరుణ్(Asim Arun) తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి(Drunked) పడుకున్నది చూశారు. మంత్రే స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు..
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ మంత్రికి చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. కన్నౌజ్‌లోని(Kannauj) జసర్‌పురా సరయ్య(Jasarpura Saraiah) గ్రామంలో పంచాయతీ ప్రధాన కార్యదర్శి(Panchayat Chief Secretary)చేసిన పనికి మంత్రి బిత్తరపోయారు. పంచాయతీ కార్యాలయానికి మంత్రి అసీమ్ అరుణ్(Asim Arun) తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి(Drunked) పడుకున్నది చూశారు. మంత్రే స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు.. మత్తు వదలనప్పటికీ బలవంతగా నిద్రలేచిన ఆ కార్యదర్శి మళ్లీ తూలి పడబోయారు. ఆయన తీరు చుట్టూ పక్కన ఉన్నవారికి విపరీతమైన నవ్వు తెప్పించింది. మిషన్-2024లో(mission 2024) భాగంగా ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామంలో పర్యిటించారు.
స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు జరిపిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ చేశారు. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకమల్(Sathis Chandrakamal) ఫుల్లుగా తాగేసి మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోతున్నారు. ఆఫీసులో ఓ వ్యక్తి అలా సోయి లేకుండా నిద్రపోవడం చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. ఎవరీయన? అని చుట్టుపక్కల వారిని అడిగారు. ఆయనే ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి అని వారు జవాబు చెప్పగానే మంత్రికి మైండ్ బ్లాంకయ్యింది. మంత్రి అతడి దగ్గరకు వెళ్లి తట్టి లేపే ప్రయత్నం చేశారు. గాఢ నిద్రలో ప్లస్ మత్తులో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్లు తెరిచి చూశాడు. చుట్టూ జనం ఉండటాన్ని చూసి లేచే ప్రయత్నం చేశాడు.
లేస్తూ తూలిపడబోయాడు. పాపం మంత్రే అతడిని పట్టుకున్నారు. కాస్త తేరుకున్న తర్వాత 'నేను మంత్రిని' అని తనను తాను పరిచయం చేసుకున్నారు. మీరిక్కడ కార్యదర్శా అని అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీశ్ చంద్ర.. తాగి ఉన్నావా అంటూ మరో ప్రశ్న వేశారు మంత్రి. తాను తాగలేదని జవాబిస్తూ మంత్రి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగారు. ఓసారి నడిచి చూపించమని మంత్రి అడిగారు. అడుగులో అడుగు వేసుకుంటూ ఓ రెండు అడుగులు వేశాడంతే.. నీపేరేమిటి అని అడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేట్‌ను చూపించాడు. తప్పతాగి పని ఎలా చేస్తారని మంత్రి అడిగితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్షమించమని వేడుకున్నాడు. ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఓ మహిళను నియమించారని, ఆమెనే అన్ని పనులను చేస్తుంటారని అక్కడివారు అన్నారు. కార్యదర్శిని మంత్రి గట్టిగా తిట్టి, సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది జరుగుతున్నంత సేపూ చుట్టుపక్కల ఉన్నవారు తెగ నవ్వుకున్నారు.