మిలిపోల్ ఇండియా 2023లో ఐకామ్ - కారకాల్ ఆయుధాల ప్రదర్శన
హైదరాబాద్ లో తయారుకానున్న సబ్ మెషిన్ గన్స్(Sub Machine Guns), కాంబాక్ట్ పిస్టల్స్(Combact pistols), స్నిపర్(Snippers), అసాల్ట్ రైఫిల్స్ ను అంతర్గత భద్రత పై ఢిల్లీ లో నిర్వహించిన అంతర్జాతీయ ఎక్సిబిషన్ మిలిపోల్ ఇండియా 2023లో(Milipole India 2023) ఐకామ్ - కారకాల్ సంస్థలు(Icom - Karak companies) ప్రదర్శించాయి.

Milipole India 2023
మిలిపోల్ ఇండియా 2023లో ఐకామ్ - కారకాల్ ఆయుధాల ప్రదర్శన
హైదరాబాద్ లో తయారుకానున్న సబ్ మెషిన్ గన్స్(Sub Machine Guns), కాంబాక్ట్ పిస్టల్స్(Combact pistols), స్నిపర్(Snippers), అసాల్ట్ రైఫిల్స్ ను అంతర్గత భద్రత పై ఢిల్లీ లో నిర్వహించిన అంతర్జాతీయ ఎక్సిబిషన్ మిలిపోల్ ఇండియా 2023లో(Milipole India 2023) ఐకామ్ - కారకాల్ సంస్థలు(Iccom - CARACAL companies) ప్రదర్శించాయి.
ఈ ఎక్సిబిషన్ ఈ నెల 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని ప్రగతిమైదాన్ లో జరిగింది. ఈ ఆయుధ నమూనాలు డిఫెన్స్ రంగంలోని సంస్థలు, అందులో నైపుణ్యం ఉన్న ప్రముఖులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Narendra Modi) ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా(Make In India) పథకాల్లో భాగంగా అత్యాధునికమైన సబ్ మెషిన్ గన్స్, పిస్టల్స్, రైఫిల్స్ ను తయారు చేసేందుకు ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ , ఎం ఈ ఐ ఎల్ గ్రూప్ సంస్థ ఐకామ్ గతంలో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. .
ఈ సందర్భంగా కారకాల్ సి ఈ ఓ హమద్ ఆల్ అమేరి మాట్లాడుతూ తమ ఉత్పత్తుల ప్రదర్శనకు మిలిపోల్ ఇండియా 2023 ఎంతో ఉపయోగపడిందని అన్నారు. రక్షణ సంస్థలకు, అంతర్గత భద్రతకు తమ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఐకామ్ ఎం డీ సుమంత్ పాటూరు మాట్లాడుతూ ఐకామ్ , కారకాల్ మధ్య జరిగిన ఒప్పందం మన అంతర్గత భద్రత, రక్షణ రంగాల బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటికి అత్యాధునిక సాంకేతికతను జోడించడం తమ ఉద్దేశ్యమన్నారు.
