మణిపూర్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. దీనికిముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మణిపూర్‌(Manipur)లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) నేడు ప్రారంభం కానుంది. దీనికిముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా(Murali Deora) కుమారుడు మిలింద్ దేవరా(Milind Deora) కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి రాజీనామా చేశారు. 47 ఏళ్ల మిలింద్ దేవరా యూపీఏ-2 హయాంలో కొంతకాలం మంత్రిగా ఉన్నారు. దేవరా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)నేతృత్వంలోని శివసేన(Shivsena)లో చేరాలని భావిస్తున్నారు.

మిలింద్ దేవరా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పార్టీని వీడడం గురించి తెలియజేశారు. ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసిందని దేవరా రాశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. కాంగ్రెస్ పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల అనుబంధం నేటితో ముగిసింది. ఇన్నేళ్లుగా తిరుగులేని మద్దతు ఇచ్చిన నాయకులు, సహచరులు, కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు.

కొందరు మాజీ కౌన్సిలర్లతో సహా దాదాపు 450 మంది తన మద్దతుదారులతో కలిసి మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన శివసేనలో చేరతారని చర్చ జరుగుతోంది. మిలింద్ దేవరాకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు ముంబై సౌత్(Mumbai South) సీటును ఇవ్వ‌డం ఇష్టం లేదు. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackrey) శివ‌సేన‌ పార్టీ నాయకుడు అరవింద్ సావంత్(Aravind Sawanth) ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో రెండోసారి ఇక్కడి నుంచి ఆయ‌న ఎంపీగా గెలుపొందారు. దేవరా 2004, 2009లో ఈ స్థానం నుంచి గెలిచి లోక్‌సభకు ఎన్నిక‌య్యారు. దేవరా ఒకప్పుడు ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

Updated On 14 Jan 2024 12:03 AM GMT
Yagnik

Yagnik

Next Story