మైక్రోసాఫ్ట్(Microsoft) సహ వ్యవస్థాపకుడు భారత పర్యటనలో భాగంగా పలు నగరాలను చుట్టేస్తున్నారు. అయితే నాగపూర్(Nagpur) పర్యటనలో ఉన్న ఆయన సోషల్ మీడియాలో(Social media) క్రేజ్ పొందిన డాలీ చాయ్‌వాలా స్టాల్‌ను(Dolly chai Wallah) సందర్శించారు.
మైక్రోసాఫ్ట్(Microsoft) సహ వ్యవస్థాపకుడు భారత పర్యటనలో భాగంగా పలు నగరాలను చుట్టేస్తున్నారు. అయితే నాగపూర్(Nagpur) పర్యటనలో ఉన్న ఆయన సోషల్ మీడియాలో(Social media) క్రేజ్ పొందిన డాలీ చాయ్‌వాలా స్టాల్‌ను(Dolly chai Wallah) సందర్శించారు. బిల్‌గేట్స్‌కు(Billgates) ప్రత్యేకంగా తయారుచేసిన టీని డాలీ అందించాడు. ఈ వీడియోను బిల్‌గేట్స్ తన అధికారిక ఇన్‌స్టాలో(Instagram) షేర్ చేశారు. వీడియోలో డాలీ స్వయంగా తయారుచేసిన ఒక కప్పు చాయ్‌ను బిల్‌గేట్స్ ఆస్వాదిస్తున్నట్లు మనకు కన్పిస్తుంది.
భారత్‌లోని ఇన్నోవేషన్ గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. "భారత్‌లో మీరు ఎక్కడికి వెళ్లినా ఎన్నో ఆవిష్కరణలు ఎదురవుతాయి. చిన్న టీ కప్పు తయారు చేయడంలోనూ ఇది కనిపిస్తుంది" అంటూ డాలీ చాయ్‌వాలాపై ప్రశంసలు కురిపించారు. "ఓ చాయ్ ప్లీజ్" అంటూ ఆ వీడియోలో బిల్‌గేట్స్ డాలీని అడిగారు. ప్రత్యేకమైన వాహనంపై డాలీ టీ తయారు చేసే విధానాన్ని వీడియో తీశారు.
టీని ఆస్వాదించిన తర్వాత.. భారత్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని బిల్‌గేట్స్ చెప్పారు. కప్పు టీని కూడా ఇంత క్రియేటివ్‌గా తయారు చేయడం ఇండియాలోనే సాధ్యం అంటూ ప్రశంసించారు. చాయ్ పే చర్చా అంటూ డాలీ చాయ్ వాలా వెనక నిలబడి ఫొటోలకు బిల్‌గేట్స్ ఫోజులిచ్చారు. అనతికాలంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. అనుకోని గెస్ట్ తన టీ స్టాల్‌ను సందర్శించడంతో డాలీ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు