అరేబియా సముద్రంలో(Arabian Sea) అల్లకల్లోలం రేపుతోన్న బిపర్‌జోయ్‌ గుజరాత్‌లోని కచ్‌(Kutch), ద్వారక(Dwaraka), జామ్‌నగర్‌ జిల్లాలలో భారీ విధ్వంసం సృష్టించానికి సిద్ధమవుతోంది. బిపర్‌జోయ్‌ అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుఫాన్‌గా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య గురువారం సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని పేర్కంది .

అరేబియా సముద్రంలో(Arabian Sea) అల్లకల్లోలం రేపుతోన్న బిపర్‌జోయ్‌ గుజరాత్‌లోని కచ్‌(Kutch), ద్వారక(Dwaraka), జామ్‌నగర్‌ జిల్లాలలో భారీ విధ్వంసం సృష్టించానికి సిద్ధమవుతోంది. బిపర్‌జోయ్‌ అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుఫాన్‌గా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య గురువారం సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని పేర్కంది . దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్‌ జిల్లాల్లో అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురియవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచివేస్తాయని హెచ్చరించింది. రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌లలో కూడా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందట. ఈ కారణంగా పంటలు, నివాసాలు, రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయని వాతావరణశాఖ పేర్కొంది. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా చమురు అన్వేషణ, నౌకల సంచారం, చేపల వేట వంటివాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని చెప్పింది. తుఫాన్‌ ప్రభావిత జిల్లాలకు చెందిన 30 వేల మందిని ఇప్పటికే తాత్కాలిక షెల్టర్లలోకి తరలించారు. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేశారు. 55 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించారు. కాండ్లా పోర్టును మూసివేశారు. ఆ పోర్టులో పనిచేసే మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Updated On 14 Jun 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story