అత్యంత తీవ్రంగా మారిన బిపర్‌జోయ్‌ తుఫాన్‌(Cyclone Biparjoy) దడ పుట్టిస్తోంది. ఈ నెల 15 వ తేదీన గుజరాత్‌లోని(Gujarat) జఖౌ పోర్టు(Jakhou Port) దగ్గర తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్ర(Arabian Sea) తీర ప్రాంత జిల్లాలైన కచ్‌(Kach), పోరుబందర్‌(Porubandhar), ద్వారక(Dwaraka), జామ్‌ నగర్‌(Jam Nagar), జునాగఢ్‌(Junagad), మోర్బిల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

అత్యంత తీవ్రంగా మారిన బిపర్‌జోయ్‌ తుఫాన్‌(Cyclone Biparjoy) దడ పుట్టిస్తోంది. ఈ నెల 15 వ తేదీన గుజరాత్‌లోని(Gujarat) జఖౌ పోర్టు(Jakhou Port) దగ్గర తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్ర(Arabian Sea) తీర ప్రాంత జిల్లాలైన కచ్‌(Kach), పోరుబందర్‌(Porubandhar), ద్వారక(Dwaraka), జామ్‌ నగర్‌(Jam Nagar), జునాగఢ్‌(Junagad), మోర్బిల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 21 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంత పరిసరాల్లో నేవీ అధికారులు(Navy Officers) ఏరియల్ సర్వే జరుపుతున్నారు.

తుఫాన్‌ ఎఫెక్ట్‌తో మూడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం. గుజరాత్‌లో హై అలెర్ట్‌ను ప్రకటించిన కేంద్రం. గుజరాత్‌-ముంబై మధ్య నడిచే 20 రైళ్లను రద్దు చేశారు. తుఫాన్‌ తీరం తాకే సమయంలో గంటకు గరిష్టంగా సుమారు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆ సమయంలో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో సౌరాష్ట్ర–కచ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఎగురవేయడంతోపాటు 16వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.

Updated On 13 Jun 2023 6:27 AM GMT
Ehatv

Ehatv

Next Story