ఒక వ్యక్తి 36 ఏళ్లుగా గర్భంతో కనిపించాడు. అతని కడుపుని వైద్యులు పరీక్షించగా.. ఎవరూ ఊహించని విషయం బయటకు వచ్చింది. నాగ్‌పూర్ నివాసి సంజు భగత్ శ‌రీరంలో ఈ వింత మార్పులు చోటుచేసుకున్నాయి. భగత్‌కి చిన్నప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా హాయిగా జీవితం గడుపుతున్నాడు.

స్త్రీలను ఈ విశ్వానికి తల్లులు అంటారు. బిడ్డను 9 నెలల పాటు కడుపులో ఉంచుకుని స్త్రీ ప్రసవించడం మ‌న‌కు తెలిసిన విష‌యం. కానీ పురుషులకు గర్భం వ‌స్తే? ఈ మాట విన‌డానికే ఒక‌లా ఉంది క‌దా..! మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక సంఘటన ఇందుకు సంబంధించిన‌దే అవ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక వ్యక్తి 36 ఏళ్లుగా గర్భంతో కనిపించాడు. అతని కడుపుని వైద్యులు పరీక్షించగా.. ఎవరూ ఊహించని విషయం బయటకు వచ్చింది. నాగ్‌పూర్ నివాసి సంజు భగత్ శ‌రీరంలో ఈ వింత మార్పులు చోటుచేసుకున్నాయి. భగత్‌కి చిన్నప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా హాయిగా జీవితం గడుపుతున్నాడు. పెరుగుతున్న క్ర‌మంలో సంజు కడుపులో మార్పు మొద‌లైంది. సంజు ఈ వాపును ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. క్రమంగా వాపు పెరగడం మొద‌లైంది. దీంతో కుటుంబ సభ్యులు దాని గురించి ఆందోళన చెందడం ప్రారంభించారు. సంజు కడుపు బాగా ఉబ్బడంతో జనాలు అతన్ని గర్భిణి అని పిలవడం మొదలుపెట్టారు. 1999లో సంజూ క‌డుపు తొమ్మిది నెల‌ల గ‌ర్భిణి పొట్ట‌లా మారింది.

క్ర‌మంగా కడుపు ప‌రిమాణం పెరుగుతూ వ‌స్తూ పరిస్థితి క్షీణించింది. క‌డుపు పెరుగుదల కారణంగా అతనికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. భరించలేనంత నొప్పులు రావడంతో కుటుంబ స‌భ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. డాక్టర్లు మొదట ట్యూమర్ ప్రాబ్లెమ్ అని అనుకున్నారు. సంజూకు ఆపరేషన్ చేసిన‌ డాక్టర్ అజయ్ మెహతా.. అత‌ని కడుపుని తెరిచిచూసిన‌ప్పుడు.. లోపల దృశ్యాన్ని చూసి అతను చలించిపోయాడు. క‌డుపులో ఉన్న‌ది కణితి కాదు.. చాలా ఎముకలు. మొదట ఒక కాలు బయటకు వచ్చింది. త‌ర్వాత మరో కాలు. ఆపై జుట్టు, చేయి, దవడ ఇలా అనేక భాగాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు 36 సంవత్సరాలుగా గర్భంలో ఆ బ‌రువును మోస్తున్నట్లు వైద్యులు కనుగొన్నారు.

సంజు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పిల్లలు కడుపులోకి వచ్చే అవకాశం ఉంది. వైద్యులు ఈ కేసును వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌గా పేర్కొన్నారు. అంటే.. ఈ కవలలు గర్భధారణ సమయంలోనే చనిపోయి ఉండాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఇలాంటి కేసులు చాలా అరుదు. భూమిపై 5 మిలియన్ల మందిలో ఒకరికి జరుగుతుంది. అది సంజు భగత్ శ‌రీరంలో జ‌రిగింద‌ని వైద్యులు పేర్కొన్నారు.

Updated On 24 Jun 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story