మన దేశ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి కాకుండా ఓ అమ్మాయి, అబ్బాయి శృంగారంలో(Romance) పాల్గొనకూడదన్న నిబంధన పురాతన కాలం నుంచి వస్తోంది. కానీ కొన్ని తెగల్లో(Tribes) మాత్రం పెద్దలే  దగ్గరుండి దీనిని ప్రోత్సహిస్తారు. మన దేశంలో వివాహానికి ముందు శృంగారం దీనిని కొందరు సమర్థిస్తారు. మరికొందరు వ్యతిరేకిస్తారు. ఫారిన్‌ కంట్రీస్‌లో పెళ్లికి(Marriage) ముందు శారీరక సంబంధం పెట్టుకోవడం సర్వ సాధారణంగానే ఉండొచ్చు కానీ సంప్రదాయాలకు విలువనిచ్చే మన దేశంలో అయితే ఇలాంటి వాటిని చాలా మంది అంగీకరించరు. కానీ మన దేశంలో మారూమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంప్రదాయముందని తెలుసా.?

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్(Bastar) జిల్లాల్లో గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తారు. ఈ తెగల ఆచారాలు, సాంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా మన దేశంలో సెక్స్‌పై బహిరంగంగా మాట్లాడడాన్ని అంగీకరించరు. కానీ ఈ గిరిజన తెగల్లో మాత్రం ఇది సర్వసాధారణం. ప్రేమికులు(Lovers) కలిసి తిరగడం.. రతి క్రీడలో పాల్గొనడం అత్యంత సహజంగా ఉంటోంది. పైగా అందరికీ తెలిసే ఈ వ్యవహారాన్ని నడపడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌లోని ఈ గిరిజనల తెగలు ఘోతుల్(Ghotul) అనే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఘోతుల్ అంటే పెద్ద పెద్ద వెదురు బొంగులతో చేసిన డార్మిటరీ. యువతీ, యువకులు ఒకరినొకరు తెలుసుకుని సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తుంటారు. 10 ఏళ్లు దాటిన వారెవరైనా ఘోతుల్‌కు వెళ్లవచ్చు. తల్లిదండ్రులు(Parents) కూడా వారిని ఘోతుల్‌కు పంపడం ప్రారంభిస్తారు. ఈ ఘోతుల్‌కు వెళ్లే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది.

యువతీ యువకులు పెళ్లి ముందే శారీరక సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. యువతీయువకులు తమ భాగస్వామిని(Partner) ఎంపిక చేసుకునే హక్కు వీరికి ఉంటుంది.ఘోతుల్‌లో యువతీ యువకులు పాటలు పాడుతూ ఒకరితో మరొకరు డ్యాన్సులు(Dance) చేసుకోవచ్చు. యువకులు తమకు నచ్చిన అమ్మాయిని ఎంచుకొని వెదురు బొంగుతో ప్రత్యేకంగా తయారుచేసిన దువ్వెనలను(Comb) అందిస్తారు. దువ్వెనలను ఆమె తలలో పెడతారు. అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ఓకే అనుకుంటే దువ్వెనను జుట్టులో ఉంచుకుంటుంది. ఇక నుంచి వారిద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవచ్చు. ఒకరితో మరొకరు శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని నెలల వరకు వీరి మధ్య బంధం అలాగే కొనసాగితే ఇరు కుటుంబాల పెళ్లి చేస్తాయి. గర్బంతో కూడా పెళ్లి పీటలకు ఎక్కినవారు చాలా మందే ఉంటారు. ఈ సంప్రదాయం ప్రకారం అత్యాచారాలు(Rape), లైంగిక వేధింపులు, విడాకులు ఉండవని స్థానికుల నమ్మకం.

Updated On 26 Jan 2024 5:16 AM GMT
Ehatv

Ehatv

Next Story