సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి. నటుడుగా ఎదగాలనుకున్నవారు మొదటగా చిరంజీవిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు.
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి. నటుడుగా ఎదగాలనుకున్నవారు మొదటగా చిరంజీవిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. నటన డ్యాన్స్‌లో ప్రయోగాలకు చిరంజీవి పెట్టింది పేరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మైలు రాళ్లను అధిరోహించారు. సాధారణ నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మహోన్నత శిఖరానికి చేరుకున్నారు. తొలుత చిన్నచిన్న పాత్రలతో వేసుకుంటూ వచ్చినా.. ఆ తర్వాత విలన్ పాత్రలో నటించినా.. ఆ తర్వాత హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీరంగంలోకి ఎదిగి ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలియనిది కాదు. ఇంత ఎదిగినా చిరంజీవి తన మూలాలను మర్చిపోలేదు.
అయితే గత పదేళ్లుగా చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడం లేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్రమంత్రిగా వ్వవహరించారు. రాష్ట్ర విభజనను ఇష్టపడని ఆయన 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో చిరంజీవి కొంత సఖ్యతగా నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి ఉప రాష్ట్రపతి లేదా రాజ్యసభకు పంపించాలన్న యోచనలో బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఈ అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించారని అంతా ఓకే అయిపోయిందని అంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి, చిరంజీవికి రాజ్యసభ ఇస్తే ఇక మెగా సోదరులు ముగ్గురు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతారు.