సోమవారం నుంచి బెంగళూరులో జరిగే రెండు రోజుల ఐక్యతా సమావేశంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు పాల్గొని 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాల్సిన వ్యూహంపై మేధోమథనం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్‌పై కాంగ్రెస్ సమ్మతి తర్వాత ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటాయని ప్రతిపక్ష వర్గాలు భావిస్తున్నాయి.
సోమవారం నుంచి బెంగళూరు(Banglore)లో జరిగే రెండు రోజుల ఐక్యతా సమావేశం(Opposition Meet)లో దేశంలోని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు(Opposition Leaders) పాల్గొని 2024 లోక్‌సభ ఎన్నిక(Loksabha Elections)ల్లో బీజేపీ(BJP)ని ఎదుర్కోవాల్సిన వ్యూహంపై మేధోమథనం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) డిమాండ్‌పై కాంగ్రెస్(Congress) సమ్మతి తర్వాత ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటాయని ప్రతిపక్ష వర్గాలు భావిస్తున్నాయి. గత నెల జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar) ఆహ్వానం మేరకు పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి కేవలం 15 పార్టీలు మాత్రమే హాజరయ్యారు. బీజేపీని ఓడించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న లౌకిక ప్రతిపక్ష పార్టీల సంకల్పానికి బెంగళూరులో రెండు రోజులపాటు జరిగే సమావేశం ముందడుగు వేస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D Raja)అన్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) కూడా హాజరు కానున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Maliikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar), బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Bangal Cm Mamata Banerjee), బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Stalin), జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemanth Soren), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagawant Mann) సహా పలు రాష్ట్రాల ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. వీరితోపాటు పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackrey), ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) ఇచ్చే విందుతో సమావేశం ప్రారంభం కానుంది. మంగళవారం అధికారిక సమావేశం జరగనుంది. ఇందులో కూటమి యొక్క రూపురేఖలు, భవిష్యత్తు కార్యక్రమాలను పరిశీలించి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇది నిర్ణయాత్మక సమావేశం అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్(Sanjay Raut) అన్నారు. పలు అంశాలను పరిశీలించనున్నారు. బెంగుళూరు సమావేశం తర్వాత బీజేపీపై తదుపరి చర్యలను మా అగ్రనేతలు ప్రకటిస్తారని మరో నేత తెలిపారు. ఈ భేటీలో గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, నియంత్రించేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర కూడా బట్టబయలు కానుందని నేతలు అంటున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ(NCP)లో చీలిక, పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో భారీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో విపక్షాల సమావేశం జరుగుతోంది. బెంగాల్ హింసాకాండకు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కారణమని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించాయి. దీనిపై దీదీ ఎలా స్పందిస్తారనే విషయమై కూడా చర్చ జరుగుతోంది.
విపక్షాల సమావేశంపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) మాట్లాడుతూ.. "ఇది పూర్తిగా విభజించబడిన సమూహం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించడానికి ప్రయత్నించడం తప్ప నిర్దిష్ట కార్యక్రమం లేదన్నారు. విపక్షాల కసరత్తు అంతా కుటుంబ రాజకీయాలను కాపాడేందుకేనని అన్నారు. ఇది పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు.. రాజవంశాల రక్షణ కూటమి అని ఎద్దేవా చేశారు.