కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి గురువారం లోక్‌సభలో ఢిల్లీ సేవల బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు మౌనం వహించాలని.. లేకుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మీ ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

Meenakshi Lekhi’s jab at Opposition in Parliament
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి(Union Minister Meenakshi Lekhi) గురువారం లోక్‌సభలో ఢిల్లీ సేవల బిల్లు(Delhi Services Bill)పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు మౌనం వహించాలని.. లేకుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మీ ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. "ఏక్ మినిట్, ఏక్ మినిట్.. శాంత్ రహో, తుమ్హారే ఘర్ ఈడీ నా ఆ జాయే" (ఒక్క నిమిషం.. మౌనంగా ఉండండి.. లేదంటే ఈడీ మీ ఇంటికి రావచ్చు) అని లేఖి సభలో చెప్పారు.
మంత్రి మీనాక్షి లేఖి వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో(Clyde Crasto) మాట్లాడుతూ.. లోక్‌సభ(Loksabha)లో లేఖి "బెదిరింపు వ్యాఖ్యలు" ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందనే ప్రతిపక్షాల ఆరోపణలను "రుజువు చేసింది" అని అన్నారు. లోక్‌సభలో మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు హెచ్చరికలా లేక బెదిరింపులా అని భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి(BV Srinivas) ప్రశ్నించారు.
