జాతీయ విద్యా విధానం (NEP) 2020 నిబంధనల ప్రకారం.. హిందీలో వైద్య కోర్సులను అందుబాటులోకి తెస్తామని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన విష‌యం తెలిసిందే.

బీహార్ రాష్ట్రంలోని వైద్య కళాశాలల నుండి MBBS కోర్సు చేయబోయే విద్యార్థులకు ఉపయోగకరమైన వార్త. జాతీయ విద్యా విధానం (NEP) 2020 నిబంధనల ప్రకారం.. హిందీలో వైద్య కోర్సులను అందుబాటులోకి తెస్తామని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టింది. బీహార్ ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సు - MBBS హిందీలో నిర్వహించ‌నున్న‌ట్లు ప్రకటించింది.

బీహార్ ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే.. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. వచ్చే అకడమిక్ సెషన్ (2025-26) నుంచి మెడిసిన్ చదివే విద్యార్థులు హిందీలో ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ‌ మంత్రి తెలిపారు.

“ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీ పాఠ్యపుస్తకాల లభ్యతతో సహా అవసరమైన అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ఆరోగ్య శాఖ ఈ చారిత్రాత్మక నిర్ణ‌యం తీసుకుంది. హిందీని ప్రోత్సహించి ప్రపంచ భాషగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

బీహార్‌లోని మెడికల్ కాలేజీలలో MBBS కోర్సు సిలబస్ ఢిల్లీలోని AIIMS సిలబస్ ఆధారంగా తయారు చేయబడుతుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో.. బీహార్ రాష్ట్రంలో నడుస్తున్న 85 వేల హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 12వ తరగతి తర్వాత వారి స్వంత భాషలో వైద్య విద్యను పూర్తి చేసే సౌలభ్యాన్ని పొందుతారు.

Eha Tv

Eha Tv

Next Story