బీటెక్‌తో(B.tech) పాటు ఎంబీఏ(MBA) పూర్తి చేసిన ఓ గ్రాడ్యుయేట్‌ తన బుర్రకు మంచి పదునుపెట్టాడు. కాకపోతే దానిని దొంగతనాలకు(Robbery) పాల్పడేందుకు ఉపయోగించుకున్నాడు. రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన సతేంద్రసింగ్ షెకావత్‌(Satendra Singh Shekawat) అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు. కానీ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దాదాపు 100 కార్లను() దొంగలించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు అమ్మేస్తుండేవాడు. తన సొంత రాష్ట్రం రాజస్తాన్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణలో కూడా పలు కార్లు దొంగిలించాడు.

బీటెక్‌తో(B.tech) పాటు ఎంబీఏ(MBA) పూర్తి చేసిన ఓ గ్రాడ్యుయేట్‌ తన బుర్రకు మంచి పదునుపెట్టాడు. కాకపోతే దానిని దొంగతనాలకు(Robbery) పాల్పడేందుకు ఉపయోగించుకున్నాడు. రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన సతేంద్రసింగ్ షెకావత్‌(Satendra Singh Shekawat) అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు. కానీ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దాదాపు 100 కార్లను(cars) దొంగలించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు అమ్మేస్తుండేవాడు. తన సొంత రాష్ట్రం రాజస్తాన్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణలో కూడా పలు కార్లు దొంగిలించాడు.

సతేంద్ర సింగ్ కారు సర్వీసింగ్ సెంటర్లకు వెళ్తుంటాడు. అక్కడ పని చేసే మెకానిక్‌లతో మాటలు కలుపుతాడు. వారిని తన దారిలోకి తెచ్చుకున్న తర్వాత కార్ల చేసిస్‌ నెంబర్లు, ఇంజిన్‌ నెంబర్లను తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే కార్లను ట్రాక్‌ చేసేందుకు ఉపయోగించే ఓబీడీ పోర్టుల్లో జీపీఎస్‌ను అమర్చి ఆ కారు ఎక్కడికి వెళ్తుందో చెక్‌ చేసేవాడు. కార్ల యజమానులు తమ ఇంటి ముందో.. మరో చోటనో కార్లను పార్క్‌ చేశారని నిర్ధారించుకున్న తర్వాత పార్కింగ్‌ స్పాట్‌కు వెళ్లేవాడు. కారు గ్లాస్‌ను పగలగొట్టి, గ్లాస్‌ ముక్కలను నీట్‌గా తీసేసి ఆధారాలు లేకుండా చే సేవాడు. ఆత తర్వాత తన దగ్గరున్న తాళంతో కారు స్టార్ట్ చేసి నడుపుకుంటూ వెళ్లిపోయేవాడు.

అయితే కారు తాళాలు సెకావత్‌కు ఎలా లభిస్తాయనే విషయం తెలియరాలేదు. కారు చేసిస్‌ నెంబర్, ఇంజిన్‌ నెంబర్ ఆధారంగా కార్ల తాళాలు తయారుచేయించాడని తెలుస్తోంది. కారు తాళం పోయిందని డీలర్‌ దగ్గరికి వెళ్తే దాని రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్, ఆధార్‌కార్డు చూపిస్తేనే ఆ కారు తాళం ఇస్తారు కానీ.. షెకావత్‌ వారిని ఎలా మేనేజ్‌ చేసేదో తెలియదు కానీ మనోడి చేతికి మాత్రం తాళం వచ్చేది. దీంతో కారు పార్కింగ్‌ చేసిన ప్రదేశానికి వచ్చి ఓనర్‌ రేంజ్‌లో బిల్డప్‌ ఇస్తూ దర్జాగా కారు నడుపుతూ తీసుకెళ్లేవాడు. తెలంగాణలో కూడా ఓ ఏడాది జైలు జీవితం అనుభవించాడు. కర్నాటక జైలు నుంచి కూడా ఇటీవలే విడుదలయ్యాడు. ఈక్రమంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన తన ఫార్చునర్ కారును ఎవరో దొంగిలించారని విపుల్ ఖండ్ ప్రాంతానికి చెందిన నరేంద్ర నాత్ శుక్లా అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 28న లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు షెకావత్‌ను అరెస్ట్ చేశారు. షెకావత్‌ను విచారించిగా గత ఏడాది నవంబర్ 22న లక్నోలోని దారుల్‌షఫాలో ఓ బ్లాక్ ఎస్‌యూవీని తానే దొంగిలిచానని దాని తర్వాత 5 రోజులకు తెలిబాఘ్‌లో మరో వైట్ ఎస్‌యూవీని‌ ఎత్తుకెళ్లానని పోలీసులకు చెప్పాడు. 2002 నుంచి షెకావత్ వందకుపైగా కార్లను దొంగిలించాడని పోలీసుల విచారణలో తేలింది.

Updated On 30 Jan 2024 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story