ఎంతసేపూ గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడిని తీసుకోవడమే కానీ చీమల పచ్చడిని(Ant Pickle) ఎప్పుడైనా ట్రై చేశారా? తినడం సంగతి సరే.. కనీసం విన్నారా అని? ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) జగదల్‌పూర్‌(Jagdalpur), ఒడిశాలోని(Odisha) మయూర్‌భంజ్‌లో ఈ చీమల పచ్చడి ఫేమస్‌ అని విన్నాం కానీ తిని చూడలేదంటారా? ఇప్పుడీ పచ్చడి కోసం చాలా మంది లొట్టలేస్తున్నారు. పైగా ఈ చట్నీలో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఎన్నో ఉన్నాయట! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టే మయూర్‌భంజ్‌ రెడ్‌ యాంట్‌ చట్నీకి జీఐ(GI Tag) ట్యాగ్ అభించింది.

ఎంతసేపూ గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడిని తీసుకోవడమే కానీ చీమల పచ్చడిని(Ant Pickle) ఎప్పుడైనా ట్రై చేశారా? తినడం సంగతి సరే.. కనీసం విన్నారా అని? ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) జగదల్‌పూర్‌(Jagdalpur), ఒడిశాలోని(Odisha) మయూర్‌భంజ్‌లో ఈ చీమల పచ్చడి ఫేమస్‌ అని విన్నాం కానీ తిని చూడలేదంటారా? ఇప్పుడీ పచ్చడి కోసం చాలా మంది లొట్టలేస్తున్నారు. పైగా ఈ చట్నీలో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఎన్నో ఉన్నాయట! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టే మయూర్‌భంజ్‌ రెడ్‌ యాంట్‌ చట్నీకి జీఐ(GI Tag) ట్యాగ్ అభించింది. సిమిలిపాల్ టైగర్‌ రిజర్వ్‌తో పాటు జిల్లాలోని ప్రతి బ్లాక్‌ ఏరియాలోని అడవులలో ఎర్ర చీమలు(Red ant) ఏడాది పొడవునా కనిపిస్తాయి. వీటితోనే మయూర్‌భంజ్‌ ప్రజలు పచ్చడి చేస్తారు. వీరు తయారు చేసే రెడ్‌ యాంట్‌ చట్నీకి భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇప్పుడు జీఐ ట్యాగ్‌ కూడా అందుకుంది. ఇక నుంచి ఎర్రచీమల చట్నీ ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపును తెచ్చకోబోతున్నది
ఈ పచ్చడిలో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్‌లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు. కరోనా కాలంలో చీమలపచ్చడినే రోగ నిరోధక శక్తిని పెంచి ఎంతో మేలు చేసింది. అసలు వైద్యపరమైన లక్షణాల కారణంగా ఎర్రచీమల పచ్చడి స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఇంతకు ముందే పరిశోధకులు తేల్చారు. అన్నట్టు ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా మేలు చేస్తుందట! చాప్‌ డా అని స్థానిక ప్రజలు పిలుచుకునే ఈ చీమల పచ్చడికి ఇప్పుడు మస్తు డిమాండ్‌ ఉంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా ఈజీనే ఈ ఎర్ర చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. తర్వాత ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కొంచెం కారంగా, కొంచెం పుల్లగా ఉంటుంది కానీ టేస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందట! అన్నట్టు కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు.

Updated On 5 Jan 2024 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story