ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకు మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు లెప్టినెంట్ గవర్నర్‌కు ఉన్నప్పటికీ.. ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకు మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు లెప్టినెంట్ గవర్నర్‌కు ఉన్నప్పటికీ.. ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.
ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత మేయర్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. మేయర్ MCD సాధారణ సమావేశాలను నిర్వహించవచ్చు, అయితే ముఖ్యమైన ఆర్థిక, విధానపరమైన పనులకు మాత్రం అంతరాయం కలుగుతుంది.
మేయర్ డాక్టర్ శైలి ఒబెరాయ్ ఆమె కోరుకున్నప్పుడు మేయర్ ఎన్నికల తదుపరి తేదీని ఇవ్వవచ్చని కార్పొరేషన్ కార్యదర్శి కార్యాలయం తెలియజేసింది. ప్రిసైడింగ్ అధికారి నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కార్పొరేషన్ సెక్రటరీ కార్యాలయం మళ్లీ పంపుతుంది. ఈ ఫైలు ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి, మళ్లీ లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరుతుంది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమైతే మేయర్ అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు.