కోవిడ్- 19 కేసులు పెరుగుతున్నందున కేరళ ప్రభుత్వం(Kerala Govt) గర్భిణీ స్త్రీలు(Pregnant Women), వృద్ధుల(Elderly people) కు మాస్క్‌లను తప్పనిసరి చేసింది. కేరళలో శనివారం 1,801 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్(Veena George) కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎర్నాకులం(Ernakulam), తిరువనంతపురం(Thiruvananthapuram), కొట్టాయం(Kottayam) జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన మెజారిటీ కేసులు ఓమిక్రాన్ వేరియంట్(Omicron variant) కు చెందినవిగా వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పిల్లలు […]

Masks Mandatory For Pregnant Women, Elderly In Kerala
కోవిడ్- 19 కేసులు పెరుగుతున్నందున కేరళ ప్రభుత్వం(Kerala Govt) గర్భిణీ స్త్రీలు(Pregnant Women), వృద్ధుల(Elderly people) కు మాస్క్‌లను తప్పనిసరి చేసింది. కేరళలో శనివారం 1,801 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్(Veena George) కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎర్నాకులం(Ernakulam), తిరువనంతపురం(Thiruvananthapuram), కొట్టాయం(Kottayam)
జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన మెజారిటీ కేసులు ఓమిక్రాన్ వేరియంట్(Omicron variant) కు చెందినవిగా వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ సూచించింది.
రాష్ట్రంలో కోవిడ్- 19(Covid-19) పరిస్థితిని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్- 19 సంబంధిత మరణాలు 60 ఏళ్లు పైబడి మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. "మేము కొవిడ్ పరీక్షలను పెంచాము. ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యే కేసులు కొద్దిగా పెరుగుతున్నాయి. మొత్తం కేసులలో 0.8 శాతం మంది రోగులకు మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్ అవసరం కాగా.. 1.2 శాతం మంది ఐసియూలలో అడ్మిట్ అయ్యారని మంత్రి చెప్పారు.
మంచాన పడిన రోగులు, ఇంట్లో వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారు కోవిడ్- 19 బారిన పడకుండా చూసుకోవాలి. ఇంట్లో వృద్ధులు, మంచాన ఉన్నవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లను ఉపయోగించాలి. సబ్బుతో చేతులు కడుక్కోవాలని ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మంత్రి కోరారు.
ఆరోగ్య శాఖ అన్ని జిల్లా ఆసుపత్రులకు సరైన కోవిడ్- 19 మూల్యాంకనాన్ని నిర్వహించాలని ఆదేశించింది. కరోనావైరస్ రోగుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని సర్జ్ ప్లాన్ ప్రకారం సౌకర్యాలను పెంచాలని ఆదేశించింది. ఆక్సిజన్ లభ్యత ఉండేలా చూడాలని శాఖను ఆదేశించిన మంత్రి.. త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
