కర్ణాటకలో పోలింగ్‌లో(Karnataka polling) ఒకటిరెండు చోట్ల ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నప్పటికీ మొత్తంగా ప్రశాంతంగా ముగిసింది. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో పోలింగ్‌ కేంద్రం నుంచి తీసుకువెళుతున్న ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు.

కర్ణాటకలో పోలింగ్‌లో(Karnataka polling) ఒకటిరెండు చోట్ల ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నప్పటికీ మొత్తంగా ప్రశాంతంగా ముగిసింది. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో పోలింగ్‌ కేంద్రం నుంచి తీసుకువెళుతున్న ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈవీఎంలను(EVM) తీసుకెళుతున్నప్పుడు పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారిని కూడా గ్రామస్థులు చితకబాదారు. ఎన్నికల సిబ్బందిపైనా దాడికి దిగారు. ఎన్నికల సిబ్బంది(Election Officers) కారును పల్టికొట్టించారు. కారును ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్‌ మిషన్లను నుజ్జునుజ్జు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈవీఎంలను ధ్వంసం చేసిన వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఈ ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపింది. కంట్రోల్‌, బాలెట్‌ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్‌లు ధ్వంసం చేశారని ఈసీ తెలిపింది.

Updated On 10 May 2023 6:58 AM GMT
Ehatv

Ehatv

Next Story