ప్రముఖ కార్ల కంపెనీలో ఒకటైన మారుతీ సుజుకీ(Maruthi Suzuki) 16 వేలకుపైగా కార్లను రీకాల్ చేసింది. ఇంధన పంప్ మోటార్‌లో లోపం ఉన్న ఓ భాగాన్ని సరిచేసేందుకు బలేనో(Baleno), వ్యాగనార్(Wanganor) కార్లను రికాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.
ప్రముఖ కార్ల కంపెనీలో ఒకటైన మారుతీ సుజుకీ(Maruthi Suzuki) 16 వేలకుపైగా కార్లను రీకాల్ చేసింది. ఇంధన పంప్ మోటార్‌లో లోపం ఉన్న ఓ భాగాన్ని సరిచేసేందుకు బలేనో(Baleno), వ్యాగనార్(Wanganor) కార్లను రికాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2019 జులై నుంచి నవంబర్ 1 మధ్యకాలంలో తయారైన 11,851 బలేనో, 4190 వ్యాగనార్ కార్లను రికాల్ చేసింది. ఇంధన పంప్ మోటార్ భాగంలో లోపం ఉంటే, అరుదుగా ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్టింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల నుంచి ఆయా కార్ల వాహన యాజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు ఉండే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో కంపెనీ కార్లను రీకాల్ చేయలేదని తెలిసింది. అయితే ఇటీవలే విడుదల చేసిన ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంక్స్ మోడళ్లకు మంచి ఆదరణ ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అరెనా, నెక్సా, ట్రూవ్యాల్యూ మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ వస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చి తొలి వారంలో కంపెనీ 43.82 బిలియన్ డాల్లర మార్కెట్ క్యాపిటల్‌ను మారుతీసుజుకీ కలిగి ఉంది.