వన్డే వరల్డ్‌కప్(One day World cup 2023) ఫైనల్ మ్యాచ్‌లో భారత్(India) విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడుతుందని అనుకున్న భారతీయులకు నిరాశే మిలిగింది. ఆస్ట్రేలియా(Australia) ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. టీమిండియా(Team India) ఓటమిని తట్టుకోలేకపోయారు అభిమానులు. అసలే బాధలో ఉన్న ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడానికి మనసొప్పలేదు ఓ సంస్థకు.

Gurugram Healing Monday
వన్డే వరల్డ్‌కప్(One day World cup 2023) ఫైనల్ మ్యాచ్‌లో భారత్(India) విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడుతుందని అనుకున్న భారతీయులకు నిరాశే మిలిగింది. ఆస్ట్రేలియా(Australia) ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. టీమిండియా(Team India) ఓటమిని తట్టుకోలేకపోయారు అభిమానులు. అసలే బాధలో ఉన్న ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడానికి మనసొప్పలేదు ఓ సంస్థకు. అందుకే ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. టీమిండియా ఓటమి కారణంగా తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్‌లోని(Gurugram) మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ(Marketing moves agency) సంస్థ సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసుకు రప్పించడం కంపెనీకి ఇష్టం లేదు. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్ ఇన్‌లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. ఉద్యోగుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కంపెనీ ముందుగానే అర్థం చేసుకుందని, పెద్ద మనసుతో తమ ఉద్యోగులు ఓటమి షాక్ నుంచి తేరుకోడానికి కొద్ది సమయం ఇచ్చిందని దీక్షా గుప్తా(Deeksha guptha) తెలిపారు. పనిలో పనిగా బాస్ పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు అభినందిస్తున్నారు.
