దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలుగు రాష్ట్రాలతో కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలున్నాయి.
మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది ఒక తెలుగు వాడి ప్రోత్సాహంతోనే.. అవును అప్పటి ప్రధాని మన తెలుగు వారైన పి. వి. నరసింహ రావు గారు, మన్మోహన్ ను రాజ్యసభ సభ్యుడిగా చేసి.. ఆర్థిక మంత్రిగా తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. 1991 నాటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి.. అప్పటికే ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను పి.వి. గారు మంత్రిని చేశారు.
UPA-1 అధికారంలో ఉండగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశంలో మొట్టమొదటి సారి అనంతపురంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది పేదవారికి అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఈ కార్యక్రమం మొదలవడానికి అప్పటి ముఖయమంత్రి వై.ఎస్.ఆర్ కీలక పాత్ర వహించారు.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారే.. వీరి హాయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రప్రభుత్వ ఆమోదం లభించింది. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వవలసిన ప్రత్యేక హోదా గురించి కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఏ.పి.కి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది అని మన్మోహన్ చెప్పారు. ఇలా మన్నోహన్ సింగ్ తెలుగు ప్రజలకు ప్రత్యేకం.