ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్(Amart Phone) వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ప్రపంచాన్ని అరచేతిలో చూసే సౌలభ్యం వీటితో మనకు కలిగింది. సోషల్ మీడియా(Social media) వాడకం విపరీతంగా పెరగడంతో స్మార్ట్ ఫోన్లను ప్రజలు వదిలిపెట్టడం లేదు.
స్మార్ట్‌ఫోన్లలో గంటల తరగడి ప్రజలు గడిపేస్తున్నారు. అదేపనిగా వీటిని వాడుతూ..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్(Amart Phone) వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ప్రపంచాన్ని అరచేతిలో చూసే సౌలభ్యం వీటితో మనకు కలిగింది. సోషల్ మీడియా(Social media) వాడకం విపరీతంగా పెరగడంతో స్మార్ట్ ఫోన్లను ప్రజలు వదిలిపెట్టడం లేదు.
స్మార్ట్‌ఫోన్లలో గంటల తరగడి ప్రజలు గడిపేస్తున్నారు. అదేపనిగా వీటిని వాడుతూ.. కొత్తకొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో పాత కాలం నాటి బంధాలు, ప్రేమలు, కుటుంబసభ్యుల మధ్య అనురాగాలు కనుమరుగవుతున్నాయి. ప్రపంచాన్ని మన దగ్గరికే తెస్తున్న ఈ ఫోన్లు.. బంధాలు, అనుబంధాలను మాత్రం దూరం చేస్తున్నాయి.
దీంతో గృహిణి మంజు గుప్త(Manju Gupta) వినూత్నంగా ఆలోచించింది. తన కుటుంబంలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఏదో ఒక రోజు చిచ్చుపెడుతుందని ఊహించింది. అంతే అనుకున్నదే తడువుగా ఆ మహిళ 'నో-ఫోన్ ఒప్పందాన్ని'(No Phone agreement) అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనిని ఉల్లంఘిస్తే నెల రోజుల పాటు ఫుడ్ డెలివరీ సేవలైన జొమాటో(Zomoto), స్విగ్గీలో(Swiggy) ఆర్డర్లు బంద్ అని నిబంధనలు విధించింది. అంతేకాదండోయ్.. ఓ రిజిస్టర్డ్ బాండ్ పేపర్(Bond Paper) తెచ్చి తమ ఒప్పందాలన్నీ రాసుకున్నారు. ఈ బాండ్ పేపర్‌పై నలుగురు కుటుంబసభ్యులు సంతకాలు కూడా చేశారు.
ఇందులో మొదటి ఒప్పదం ఏంటంటే.. ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూడకుండా.. సూర్యభగవానుడికి నమస్కారం(Surya Namaskar) చేయాలి. రెండోది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఒకేసారి కలిసి భోజనం(Family Lunch) చేయాలి. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు డైనింగ్ టేబుల్‌పై(dining Table) నిషేధం. కనీసం 20 నిమిషాల పాటు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి. ఇక మూడో ఒప్పందం ఏంటంటే వాష్‌రూంకు వెళ్లినప్పుడు సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా నిషేధం. వాష్‌రూంకు వెళ్లి సోషల్ మీడియాలో రీల్స్ చూడడం నిషేధం. ఈ మూడు ఒప్పందాలను కుటుంబసభ్యులందరూ పాటించాలని 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకున్నారు. ఈ నిబంధనలను ఏ ఒక్కరు ఉల్లంఘించినా నెల రోజులపాటు స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్లకు అవకాశం లేదు. చూశారుగా కుటుంబసభ్యుల మధ్య అంతరించిపోతున్న బంధాల కోసం మంజు గుప్త అనే గృహిణి చేసిన పని. ఈ బాండ్ పేపర్ ఇప్పుడు నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. దీనిపై పలువురు స్పందిస్తూ మంజు గుప్త చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.