మే 3వ తేదీ బుధవారం మీటీ వర్గాన్ని ఎస్టీ కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్‌కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా హింస చెలరేగింది. నిరసనకారులు పలు ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
మణిపూర్‌లో హింస చెలరేగింది. మే 3వ తేదీ బుధవారం మీటీ(Meiteis) వర్గాన్ని ఎస్టీ కేటగిరీ(Scheduled Tribe (ST) status)లో చేర్చాలన్న డిమాండ్‌కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్(All Tribal Student Union Manipur) ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా హింస చెలరేగింది. నిరసనకారులు పలు ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్బాంగ్ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింస చెలరేగింది. దీంతో ఇతర జిల్లాలలో కూడా హింస జరిగినట్లు నివేదికలు వచ్చాయి. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
గిరిజనుల ఆందోళన సందర్భంగా పలు జిల్లాల్లో హింస చెలరేగింది. పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ సాయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆర్మీ సిబ్బందిని భారీగా మోహరించారు. మణిపూర్‌లోని అడ్మినిస్ట్రేషన్ అభ్యర్థన మేరకు మే 3 సాయంత్రం నుండి ఆర్మీ(Army).. అస్సాం రైఫిల్స్(Assam Rifles) అన్ని ప్రభావిత ప్రాంతాలలో మోహరించినట్లు ఆర్మీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హింసాత్మక ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు(Internet Services) కూడా బంద్ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్, చురాచంద్‌పూర్(Churachandpur), కాంగ్‌పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో బ్రాడ్‌బ్యాండ్(Bradband Services) సేవలు కొనసాగుతున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా(Amith Shah) ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్(Biren Singh)తో చర్చలు జరిపారు. పరిస్థతిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని షా హామీ ఇచ్చారు.
మీటీ కమ్యూనిటీని గిరిజన వర్గంలో చేర్చే విషయమై ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని ఏప్రిల్ 19న మణిపూర్ హైకోర్టు(Manipur High Court) సూచించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్‌లోని బిష్ణుపూర్(Bishnupur), చురాచంద్‌పూర్(Churachandpur) జిల్లాల్లో హింస చెలరేగింది. ఆ తర్వాత హింస పలు జిల్లాలకు వ్యాపించింది.