మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా హింసాత్మక ఘటనల్లో ఓ పోలీసు సహా ఐదుగురు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో ప్రజలు మరణించారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది కుకీ తెగకు చెందిన తిరుగుబాటుదారులు హతమయ్యారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.

Manipur Fresh Clash Killed Five Include Policeman Insurgent Groups Planning Big Attack On Army
మణిపూర్(Manipur)లో మళ్లీ హింస చెలరేగింది. తాజా హింసాత్మక(Fresh Clash) ఘటనల్లో ఓ పోలీసు సహా ఐదుగురు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో ప్రజలు మరణించారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)లో 40 మంది కుకీ తెగకు చెందిన తిరుగుబాటుదారులు(Kuki militants) హతమయ్యారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్(Biren Singh) ఆదివారం ప్రకటనలో తెలిపారు. సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది.
మీడియా కథనాల ప్రకారం.. తాజా హింస వెనుక కొన్ని సంస్థలకు చెందిన మిలిటెంట్ గ్రూపుల(Militant Groups) హస్తం ఉందని చెబుతున్నారు. అత్యాధునిక ఆయుధాలతో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు సహా ఐదుగురు మృతి చెందారు. ఇంఫాల్ పశ్చిమ(Imphal West) జిల్లాలోని ఫెంగ్ ప్రాంతంలో జరిగిన హింసాకాండలో ఒకరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. కక్చింగ్(Kakching) జిల్లాలోని సుగాను ప్రాంతంలో జరిగిన హింసాకాండలో ఒక పోలీసు మరణించగా, ఒక పోలీసు గాయపడ్డాడు. ఇక్కడ ఆరుగురు పౌరులు కూడా గాయపడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున సుగానులోనే ఐదు గ్రామాల్లోని కుకి గిరిజనుల ఇళ్లను ఒక గుంపు తగలబెట్టింది. ఇంఫాల్ వెస్ట్‌లో బిజెపి ఎమ్మెల్యే కెహెచ్ రఘుమణి సింగ్(Raghumani Singh) ఇంటిని కోపంతో ఓ గుంపు తగులబెట్టింది. ఉరిపోక్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చురాచంద్‌పూర్ జిల్లాలోని కంగ్వీ, ఇంఫాల్ తూర్పులోని సగోమాంగ్, బిషెన్‌పూర్‌లోని నుంగోయిపోక్పి, ఇంఫాల్ పశ్చిమంలోని ఖుర్ఖాల్‌లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. కక్చింగ్ జిల్లాలోని సెరౌ, సుగాను వద్ద మైతీ వర్గానికి చెందిన 80 ఇళ్లను తిరుగుబాటుదారులు తగులబెట్టారు. అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించారు.
