బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి(Sudheer Reddy), పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy) మదురై కోర్టు ముందుకు వచ్చారు. ఈ మేరకు కోర్టు(Court) ఆవరణలో వారిద్దరు ఉన్న ఫొటోలను మాణికం ఠాగూర్‌(Manikam Tagore) షేర్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి(Sudheer Reddy), పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy) మదురై కోర్టు ముందుకు వచ్చారు. ఈ మేరకు కోర్టు(Court) ఆవరణలో వారిద్దరు ఉన్న ఫొటోలను మాణికం ఠాగూర్‌(Manikam Tagore) షేర్‌ చేశారు. తనపై అకారణమంగా విమర్శలు చేశారని తన స్వస్థలంలో పరిధిలోని మదురై కోర్టులో(Madhurai Court) పరువునష్టం దావా వేశారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) అమ్ముకున్నారని ఆ సమయంలో ఈ ఎమ్మెల్యేలు ఆరోపించారని మాణికం ఠాగూర్‌ కేసు వేశారు.

ఈ క్రమంలో వాయిదాలకు వారు హాజురుకాకపోవడంతో ఇద్దరిపై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. విచారణకు హాజరుకావాలన్న కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా ఉన్నారు. ఈ క్రమంలో నాన్‌బెయిలబుల్‌ వారెస్ట్ జారీ కావడంతో అరెస్టు చేయడం ఖాయమని వెంటనే కోర్టుకు హాజరై వాలెంట్లను రీకాల్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ మదురై కోర్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో(Social media) పోస్టు చేసిన మాణికం ఠాగూర్.. తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారెవరినీ వదిలేది లేదని.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Updated On 10 Jan 2024 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story