బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కలియుగంలో చిత్రవిచిత్రాలు జరుగుతాయని! అట్టాగే మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఓ చిత్రం చోటు చేసుకుంది. ఓ వేప చెట్టుకు(Neem Tree) మామిడి కాయలు(Mango) కాశాయి. జోకులేయకండి అని అంటున్నారా? నిజమేనండి.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతుంది. కావాలంటే అది చూడండి.. ఎవరో చెబితే అనుకోవచ్చు కానీ సాక్షాత్తూ మధ్యప్రదేశ్‌ మంత్రిగారే ఈ విషయం చెప్పారంటే నమ్మక తప్పడం లేదు. భూపాల్‌లోని(Bhupal) పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అధికారిక నివాస ప్రాంగణంలో ఓ వేపచెట్టు ఉంది

బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కలియుగంలో చిత్రవిచిత్రాలు జరుగుతాయని! అట్టాగే మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఓ చిత్రం చోటు చేసుకుంది. ఓ వేప చెట్టుకు(Neem Tree) మామిడి కాయలు(Mango) కాశాయి. జోకులేయకండి అని అంటున్నారా? నిజమేనండి.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతుంది. కావాలంటే అది చూడండి.. ఎవరో చెబితే అనుకోవచ్చు కానీ సాక్షాత్తూ మధ్యప్రదేశ్‌ మంత్రిగారే ఈ విషయం చెప్పారంటే నమ్మక తప్పడం లేదు. భూపాల్‌లోని(Bhupal) పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అధికారిక నివాస ప్రాంగణంలో ఓ వేపచెట్టు ఉంది. ఆ చెట్టుకు మామిడికాయలు కనిపించాయి. దాంతో మంత్రిగారే స్వయంగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆయన పోస్ట్‌ చేసిన వీడియోలో అయితే వేపచెట్టుకు మామిడికాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
'నా ఇంటి ఆవరణలో వేప చెట్టు దగ్గరకు వెళ్లి చూశాను. దానికి మామిడికాయలు చూసి నా మనసు పులకించింది.కొన్నేళ్ల కిందట ప్రతిభ గల ఓ తోటమాలి ఏదైనా ప్రయోగం చేసి ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం ఓ అద్భుతం' అని మురిసిపోతూ చెప్పారు ప్రహ్లాద్‌ సింగ్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నది. మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు అందించారు. వారు వచ్చి వేపచెట్టును పరిశీలించారు. ఆ చెట్టుకు పాతికేళ్ల వయసు ఉండవచ్చని అంచనా వేశారు. వేపచెట్టులో మామిడి కొమ్మను గుర్తించారు. కొన్నిసార్లు మామిడి చెట్ల నుంచి పూతరాలి పక్కన ఉండే చెట్లపై మొక్కలుగా పెరుగుతుంటాయని ఓ వృక్షశాస్త్రవేత్త చెబుతున్నాడు. శాస్త్రవేత్తల సంగతేమిటో కానీ, వీడియో చూసిన వారంతా దేవుడి మహిమేనని అంటున్నారు. మరికొందరు ఆ పండ్లలో మధుమేహాన్ని తగ్గించే గుణాలు ఉండవచ్చంటున్నారు. మరికొందరు వేపచెట్టు మామిడి కొమ్మతో అంటుకట్టి ఉండవచ్చని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

Updated On 27 May 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story