రాజస్థాన్‌లో(Rajasthan) హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని జైపూర్‌లో(Jaipur) మంగేశ్ అరోరా(Mangesh Arora) అనే వ్యక్తి తన ప్రియురాలు ఉమతో(Uma) గొడవపడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Jaipur Crime
రాజస్థాన్‌లో(Rajasthan) హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని జైపూర్‌లో(Jaipur) మంగేశ్ అరోరా(Mangesh Arora) అనే వ్యక్తి తన ప్రియురాలు ఉమతో(Uma) గొడవపడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత మంగేశ్ కారెక్కి అడ్డుగా ఉన్న ప్రియురాలును, మరో వ్యక్తిని ఢీ కొట్టాడు. కారును ఆపకుండానే వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఉమ అక్కడికక్కడే కన్నుమూసింది. తన స్నేహితుడు రాజ్‌కుమార్‌కు మాత్రం గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. నిందితుడు మంగేశ్ అరోరాను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
