రాహుల్ గాంధీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బదులిచ్చింది. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలపై జైశంకర్ విమర్శలు గుప్పించారు. జైశంకర్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్ స్పందిస్తూ.. జాతీయ రాజకీయాలను దేశం నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్ళే పద్దతిని ప్రారంభించిన వ్యక్తి మరెవరో కాదని.. మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి అని అన్నారు. జాతీయ రాజకీయాలను దేశం నుంచి బయటకు తీయడం దేశ ప్రయోజనాల కోసం కాదని జైరాం రమేష్ అన్నారు.

రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బదులిచ్చింది. అమెరికా(America)లో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలపై జైశంకర్ విమర్శలు గుప్పించారు. జైశంకర్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్(Jairam Ramesh) స్పందిస్తూ.. జాతీయ రాజకీయాలను దేశం నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్ళే పద్దతిని ప్రారంభించిన వ్యక్తి మరెవరో కాదని.. మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి అని అన్నారు. జాతీయ రాజకీయాలను దేశం నుంచి బయటకు తీయడం దేశ ప్రయోజనాల కోసం కాదని జైరాం రమేష్ అన్నారు.

ప్రధాని మోదీ(PM Modi)పై జైరాం ట్విటర్‌(Twitter)లో పరోక్షంగా విరుచుకుపడ్డారు.‘‘జాతీయ రాజకీయాల(National Politics)ను దేశం నుంచి బయటకు తీసుకెళ్లే పద్దతిని ప్రారంభించిన వ్యక్తి మరెవరో కాదు.. మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తి.. అది మీకు తెలుసు. మీరు దానిని అంగీకరించలేరని పేర్కొన్నారు.

జైశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికాలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్‌ చేసిన ఘాటైన వ్యాఖ్యలపై, భారతదేశం(India)లో ఏమి చేసినా తనకు ఇబ్బంది లేదని.. అయితే అంతర్గత సమస్యలను బ‌య‌ట‌ పెట్టడం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశాన్ని విమర్శించడం.. బీజేపీ(BJP) రాజకీయాలపై వ్యాఖ్యానించడం అలవాటు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రపంచం గమనిస్తోందని అన్నారు.

రాహుల్‌పై జైశంకర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా(Randeep Surjewala)ని ప్రశ్నించగా.. విదేశాంగ మంత్రి(External Affairs Minister)కి బీజేపీ పాత స్క్రిప్ట్‌ని ఇచ్చిందని, ఆయన కొత్త స్క్రిప్ట్‌ని చదవాలని అన్నారు. గత ప్రభుత్వాలను ప్రధాని ఎగతాళి చేశారని, 70 ఏళ్లకు పైగా దేశ చరిత్రపై ప్రశ్నలు సంధించారు. మన రాజ్యాంగ సంస్థలపై క్రమపద్ధతిలో దాడి జరుగుతోందన్నది రాహుల్ గాంధీ చెప్పిన నిజమ‌న్నారు.

Updated On 8 Jun 2023 10:41 PM GMT
Yagnik

Yagnik

Next Story