మోటార్ సైకిల్ ఎక్కగానే వెధవ్వేషాలు వేస్తారు కొందరు. హీరోలా ఫీలైపోతుంటారు. స్టంటులు గట్రాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎన్నిసార్లు హితవు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు కూడా పట్టించుకోవడం లేదు. బైకులతో స్టంట్లు, ర్యాష్ డ్రైవింగ్(Rasjh Driving) చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మోటార్ సైకిల్ ఎక్కగానే వెధవ్వేషాలు వేస్తారు కొందరు. హీరోలా ఫీలైపోతుంటారు. స్టంటులు గట్రాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎన్నిసార్లు హితవు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు కూడా పట్టించుకోవడం లేదు. బైకులతో స్టంట్లు, ర్యాష్ డ్రైవింగ్(Rasjh Driving) చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ బైకర్ చేసిన స్టంట్ ఒకటి మహారాష్ట్ర(Maharastra)లో చోటు చేసుకుంది. ఆ వీడియో చూసిన పోలీసులు ఆ బైకర్‌పై కేసు పెట్టారు.
మహారాష్ర్ట రాజధాని ముంబాయి(mumbai)లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓ యువకుడు తన బైక్‌పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక భాగంలో మరో యువతిని కూర్చోబెట్టుకున్నాడు. ట్రిపుల్ రైడింగే తప్పంటే ప్రమాదకరమైన స్టంట్స్ కూడా చేశాడు. బైక్ ముందుభాగాన్ని అమాంతం పైకి లేపి కొద్దిదూరం పాటు బైక్‌ను తీసుకెళ్లారు. ఈ విధంగా కొద్ది దూరం ముందు టైర్ గాల్లోనే ఉండింది. బైక్ మీద ఉన్న అమ్మాయిలు కేరింతలు కొట్టడం గమనార్హం. ఈ దిక్కుమాలిన చర్యకు సంబంధించిన వీడియోను మరో బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తి తీశాడు. ఈ వీడియోను పాట్‌హోల్ వారియర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది. అంతేచాలా స్పీడ్‌గా వైరల్ అయ్యింది. అది మహారాష్ట్ర పోలీసుల దృష్టిలో పడింది. కాదు కాదు, పోలీసుల దృష్టికి పాట్‌హోల్ వారియర్స్ ఫౌండేషనే తీసుకెళ్లింది. వీడియోతో పాటు బైక్ నంబర్‌ను కూడా జోడించింది. వీడియోను చూసిన పోలీసులు బైకర్‌తో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలపై కూడా కేసులు పెట్టారు. వీరి గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.